ఒక హీరోయిన్ కు అనుగుణంగా సినిమా షెడ్యూల్స్ ప్లాన్ చేయడం ఆమె అభిప్రాయాలకు అనుగుణంగా ఆ సినిమాలలోని ఆమె పాత్రను తీర్చిదిద్దడం ప్రస్తుత పరిస్థుతులలో ఎవరికీ జరగకపోయినా సాయి పల్లవి విషయంలో నూటికి నూరు పాళ్ళు జరుగుతూ ఉండటం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టాప్ హీరోలు తమను హీరోయిన్ గా ఎంపిక చేస్తే చాలు పాత్ర గురించి అడగకుండా ఎప్పుడు ఇమ్మంటే అప్పుడు డేట్స్ ఇస్తూ షూటింగ్ కు ఏ టైమ్ కు రమ్మంటే ఆ టైమ్ కు వస్తూ అందరి పట్లా అణుకువగా ముఖ్యంగా హీరోల పట్ల వినయ విధేయతలతో నడుచుకోవడం నేటి తరం హీరోయిన్స్ కు ఉండవలసిన ప్రధాన లక్షణం.

అయితే ఈ లక్షణాలకు అన్నింటికీ విరుద్ధంగా ప్రవర్తిస్తూ తన మాటే నెగ్గుకు వచ్చేలా ప్రవర్తిస్తున్న సాయి పల్లవి వ్యవహార శైలి వల్ల ఆమె నటిస్తున్న అన్ని సినిమాల షెడ్యూల్స్ మారిపోతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవికి కథ నచ్చుతుందా లేదా అని నిర్మాతలు తెగ బెంగ పడిపోతూ ఆమె కోసం ప్రత్యేకంగా రచయితల చేత జాగ్రత్తగా కథలు రాయిస్తున్నారు అంటే సాయి పల్లవి స్టార్ డమ్ ను జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి.
SAIPALLAVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ పైనా జరగనంత నెగిటివ్ ప్రచారం ఈమె పై జరిగినా ఏమాత్రం సాయి పల్లవి పట్టించుకోలేదు. తన పద్ధతిలో ఎటువంటి మార్పులు తీసుకురావడం లేదు. మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీలో తన మాటే నెగ్గెట్టు అన్ని విషయాలలోనూ సాయి పల్లవి వ్యవహరిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

దీనికితోడు హీరోలతో నటించే రొమాంటిక్ సన్నివేశాల విషయంలో కూడ తన అనుమతి లేకుండా ఎటువంటి ఇంటిమేట్ సీన్స్ ను దర్శకుడు డిజైన్ చేసినా సాయి పల్లవి అవుట్ రైట్ గా తిరస్కరిస్తోందట. జరుగుతున్న ఈవిషయాలను చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటే మరికొందరు మాత్రం హీరోలకు అప్పుడప్పుడూ చుక్కలు చూపించే సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల హీరోల ఇగోకు కొంత కట్టడి వేసినట్లు అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె అడగకుండానే కోటిన్నర పారితోషికాన్ని నిర్మాతలు ఆఫర్ చేస్తున్న నేపధ్యంలో హీరోల స్థాయిలో స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ ‘ఫిదా’ బ్యూటీ..  


మరింత సమాచారం తెలుసుకోండి: