అవును మీరు వింటున్నది నిజమే పవన కళ్యానే తన చేయబోయే తరువాత సినిమాను ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే మైత్రీ మూవీస్ వారు లీగల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అతనికి ఇచ్చిన 12 కోట్లకు గాను 20 కోట్లు వెనక్కు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ లెక్కలు అన్నీ చూసి అభిమానులు ఎంతగా బాధపడుతున్నారో కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ , ఇప్పుడు మరో వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
Image result for pavan kalyan
పవన్ కళ్యాణ్ కమిట్ అయిన రెండు సినిమాలు అసలు చేస్తాడా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ , ఇప్పుడు అతను మరో సినిమా చెయ్యడానికి రెడీ అన్నాడు. యస్. నిజమే. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ధ్రువీకరించాడు. అయితే నటుడిగా కాదు అండోయ్. నిర్మాత గా . పవన్ కళ్యాణ్ నిర్మాతగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే కంపెనీ నుంచి ఒక కొత్త సినిమా వస్తోంది.
Image result for pavan kalyan
నితిన్ హీరోగా అతని 25 వ సినిమాని , కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఒక పక్కన పాలిటిక్స్ తో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ నుండి ఇలాంటి వార్త రావడం నిజంగా సంతోషమే అని, ఈ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ కి సినిమాలు చేసే ఆసక్తి ఇంకా పోలేదని చెప్పకనే చెప్తున్నారు. పైగా ఈ సినిమాకి కూడా స్టోరీ త్రివిక్రమ్ ఏ రాసారని అన్ని విషయాల్లో జాగ్రత్తపడ్డారని పాజిటివ్ హైప్ మార్కెట్ లో ఉంది. తన సొంత సినిమాలకు కామెరికాల్ మసాలాలు దట్టిస్తున్న త్రివిక్రమ్ , ఈ సినిమాకోసం మాత్రం మంచి ఫీల్ ఉన్న కథని రాసుకుని వచ్చాడు అంట.  ఈ సినిమా కొంత భాగం ఇండియాలో , మరికొంత భాగం అమెరికాలో జరుగుతుంది అట. ఈ సినిమాలో లై సినిమా లో హీరోయిన్ గా నటించిన మేఘా ఆకాష్ మళ్ళీ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: