యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కుతుందని అందరు అంటున్నారు. మధుబాబు రచించిన షాడో నవల ఆధారంగా ఈ సినిమా కథ తీస్తున్నారని టాక్ వచ్చింది.


అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఏకంగా ఆ నవల రచయితనే టార్గెట్ చేసి అడిగేశారు.. రీసెంట్ గా మధుబాబుని ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ చేయగా అందులో త్రివిక్రం, ఎన్.టి.ఆర్ సినిమాకు తన నవల వాడుతున్నారన్న విషయంపై నోరు విప్పాడు మధుబాబు.


అంతేకాదు ఆ సినిమాకు రచనా సహకారం అందిస్తున్నారు అన్న విషయంపై కూడా స్పందించారు. తనతో ఆ సినిమాకు సంబందించిన వారెవరు మాట్లాడలేదని. అసలు తన నవలను కూడా వారు తీసుకోవట్లేదని అన్నారు. సో మొత్తానికి ఈసారి త్రివిక్రం ఎలాంటి కథలను స్పూర్తిగా పొందకుండా సినిమా తీస్తున్నాడేమో అని అంటున్నారు.


ఇదవరకు త్రివిక్రం అ ఆ సినిమ యద్దనపూడి సులోచనరాణి మీరా నవల ఆధారంగా తెరకెక్కించారు. ఆ సినిమాలో ఆమెకు క్రెడిట్ ఇచ్చేశారు. ఇక మరో పక్క అజ్ఞాతవాసి సినిమాకు లార్గో వించ్ సినిమాకు యాజిటీజ్ దించేశాడని తెలిసిందే. మరి తనకున్న ఇమేజ్ కాపాడుకునే క్రమంలో త్రివిక్రం తారక్ సినిమాతో సత్తా చాటుతాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: