ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు పార్టీల్లో, పబ్బుల్లో విచ్చలవిడిగా రెచ్చిపోతూ..నానా హంగామా చేస్తూ...అడ్డంగా బుక్ అవుతున్నారు.  తాజాగా తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తమ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన హీరోయిన్లు  ఖుష్బూ -సుకన్య  పర్సనల్ వీడియో ఒకటి బయటికి వచ్చింది.  ఖుష్బూ సుందర్‌, సుకన్యలు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. చెన్నైలోని సవేరా హోటల్‌లో విందు సందర్భంగా ప్రముఖ హిందీ సాంగ్‌ 'పియా తూ అబ్‌ తొ ఆజా' ప్లే చేశారు.

సాంగ్‌కి తగ్గట్టుగా ఖుష్బూ అద్భుతమైన స్టెప్పులు వేశారు. ఈ వీడియోలో నటుడు దర్శకుడు మనోబాల కూడా పక్కనే ఉన్నాడు. అసలే సీనియర్ హీరోయిన్లు..గతంలో కుర్రకారుకి మత్తెక్కించిన భామలు..మరి ఇలా డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోవడంతో..మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తున్నారని వైరల్ అయ్యింది.  తమిళ ఇండస్ట్రీలో ఖుష్బూ అప్పట్లో తమిళ తంబీలు అంటే వీరాభిమానం చూపించేవారు.. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది ఖుష్బు. 

ఆ మద్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.  పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంలో  తల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే.200లకు పైగా చిత్రాల్లో నటించిన ఖుష్బూ తమిళ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఖుష్బూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఇక సుకన్య విషయానికి వస్తే..ఆ మద్య సెక్స్ రాకెట్ లో అడ్డంగా బుక్ అయిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: