సాధారణంగా సినిమా షూటింగ్స్ అంటే ప్రశాంతంగా సాగిపోతుందని అనుకుంటారు..కానీ కొన్ని షూటింగ్స్ ప్రాణాల మీదకు తీసుకు వస్తుందని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి.  ముఖ్యంగా ఫైరింగ్, వాటర్ ఫాల్స్, సముద్రం పరిసర ప్రాంతాల్లో జరిగే షూటింగ్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.  ఆ మద్య కన్నడ ఇండస్ట్రీలో ఇద్దరు ఫైట్ మాస్టర్లు షూటింగ్ కోసం నీళ్లలో దూకి ప్రాణాలు విడిచారు.  తాజాగా ఓ ప్రముఖ హాలీవుడ్ నటి ఓ షూటంగ్ లో తనను చంపడానికి చూశారని స్టేట్ మెంట్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
Kill Bill stunt coordinator speaks out on Uma Thurman car crash ‘At no point was I notified’ - Sakshi
వివరాల్లోకి వెళితే..క్వెంటిన్‌ టరంటీనో దర్శకత్వంలో ‘కిల్‌బిల్‌’ (2003) సినిమా తెరకెక్కుతోంది. అందులో ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఉమా థర్మన్‌ అడవిలో ఉన్న ఒక రోడ్‌ మీద వేగంగా కారు నడుపుతూ వెళ్లాలి. గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో థర్మన్‌ కారు నడుపుతూ చెట్ల మధ్యలోంచి దూసుకెళ్తుంది..అయితే ఒక్కసారే రోడ్డు ఓ దగ్గర మలుపొచ్చింది. ఆమె ఆ మలుపును చూసి కార్‌ను కంట్రోల్‌ చేస్కోలేక రోడ్డుకి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది.  అంతే ఆ ప్రమాదంలో తన ప్రాణాలు పోయాయని అనుకుంది..కానీ మోకాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.

పదిహేనేళ్లు దాటినా థర్మన్‌ను ఆ గాయాలింకా బాధపెడుతూనే ఉన్నాయి. తన యాక్సిడెంట్ కు సంబంధించిన పుటేజ్ ఇవ్వమని కోరినా వెయిన్ స్టీన్ వాటిని తనకు ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. స్టంట్ మేన్ తో దానిని చేయించమని చెప్పినా దర్శకుడు ఒప్పుకోలేదని, దీనిని బట్టి తనను చంపడానికి వేసిన స్కెచ్ గా దీనిని భావిస్తున్నానని ఆమె పేర్కొంది.   ఇదిలా ఉంటే..హార్వీ వెయిన్‌స్టీన్‌ అనే నిర్మాతపై లైంగిక ఆరోపణలు రావడం, తద్వారా ‘మీటూ’ అన్న ఒక ఉద్యమమే పుట్టడం గతేడాది చూశాం.
Related image
ఆ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా హార్వీ వెయిన్‌స్టీన్‌పై థర్మన్‌ కూడా ఆరోపణలు చేసింది. అంతే కాదు  ‘‘అది నన్ను చంపడానికి వేసిన ప్లాన్‌. స్టంట్‌మెన్‌తో ఆ సీన్‌ చేయించమని చెప్పినా టరంటీనో దానికి ఒప్పుకోలేదు. ఆ కారు కండీషన్‌ బాగాలేదు. కావాలనే ఇన్నేళ్లైనా ఆ యాక్సిడెంట్‌ విజువల్స్‌ సాక్ష్యాలకు అందకుండా నిర్మాత వెయిన్‌స్టీన్‌ నాకు చూపించలేదు’’ అని వాదించింది థర్మన్‌. 
Image result for kill bill movie
 కాగా, దీనిపై ఆ సినిమా డైరెక్టర్ క్వెంటిన్ టరంటీనో మాట్లాడుతూ, తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఆ స్టంట్ చిత్రీకరణేనని పేర్కొన్నాడు. ఆ రోడ్డు తిన్నగా ఉందని భావించానని, మలుపు ఉందని ఊహించలేదని చెప్పాడు. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదేనని చెబుతూ ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఆ నాటి యాక్సిడెంట్ విజువల్స్ ను ఆమెకు స్వయంగా పంపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: