మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన సినిమా తొలిప్రేమ సక్సెస్ సాధించడంతో మంచి జోష్ లో ఉన్నాడు. శనివారం రిలీజ్ అయిన ఈ సినిమా రెండు రోజుల్లోనే 9 కోట్ల పైగా షేర్ వాల్యూ వసూళ్లను రాబట్టింది. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.


ఇక తొలిప్రేమ ప్రమోషన్స్ లో బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్థావించాడు వరుణ్ తేజ్. జనసేన అధినేతగా బాబాయ్ పవన్ కళ్యాన్ సినిమాలను వదలడం ఎంతవరకు కరెక్ట్ అని వరుణ్ తేజ్ ను అడుగగా.. అది తన ఇష్టమని.. నావరకు బాబాయ్ సినిమాలు కూడా చేస్తే బాగుంటుందని అన్నారు.


అంతేకాదు సినిమాలను.. ఆ క్రేజ్ వదిలి జనాల్లోకి వెళ్లి మంచి జరిగేలా చేయాలని చూడటం మంచి విషయమని అన్నారు. అయితే అలా తన వల్ల కాదని మాత్రం అంటున్నాడు వరుణ్ తేజ్. ఆ గట్స్ బాబాయ్ పవన్ కళ్యాన్ ను మాత్రమే ఉన్నాయని అంటున్నాడు వరుణ్ తేజ్. పవన్ కళ్యాన్ కు తన ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉంది.


ఆల్రెడీ చరణ్ జనసేనకు తన సపోర్ట్ అందించగా.. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా బాబాయ్ పవన్ జనసేనకే తమ ఓటు అంటున్నాడు. ఇక పవన్ సినిమాలు చేయడం చేయకపోవడం పట్ల మాత్రం వరుణ్ తన అభిప్రాయం చెప్పాడు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న పవన్ రాజకీయ ప్రక్షాళన చేయాలని చూస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: