స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి.. అతని సినిమాల ఫలితాల గురించి అందరికి తెలిసిందే. మెగా హీరోగా వరుస విజయాలను అందుకుంటున్న బన్ని ప్రస్తుతం వక్కతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. టీజర్ తో అంచనాలను పెంచిన ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది.


ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరి డైరక్షన్ లో తన తర్వాత సినిమా చేస్తాడు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.  అయితే తనకు కథ చెప్పే దర్శకులకు కొన్ని ఆంక్షలు పెడుతున్నాడట బన్ని. సినిమా కథ మీద పూర్తిస్థాయి పర్యవేక్షణ నిర్వహిస్తున్నారట. అంతేకాదు తన కెరియర్ కు ఉపయోగపడేలా వారు చెప్పిన కథలో కొన్ని ఇన్ పుట్స్ ఇస్తున్నారట. 


ఇదే కాదు సినిమా షూటింగ్ టైంలో కూడా అనుకున్నది సరిగా రాకుంటే బన్ని వీరప్రతాపం చూపిస్తాడట. అయితే ప్రస్తుతం ఉన్న కాంపిటీటివ్ ప్రపంచంలో స్టార్స్ కు కూడా ఈ తిప్పలు తప్పవు. కాని బన్ని మాత్రం తన అతి జాగ్రత్తతో డైరక్టర్స్ ను భయపెడుతున్నాడని అంటున్నారు. తనతో చెప్పకున్నా సరే బయట మాత్రం ఈ టాక్ స్ప్రెడ్ అవుతుంది. 


ఈమధ్యనే తమ్ముడు అల్లు శిరీష్ తో ఒక్క క్షణం తీసిన విఐ ఆనంద్ డైరక్షన్ లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. నా పేరు సూర్య అనుకున్న రేంజ్ లో హిట్ అయితే బన్ని క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 27న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాకు పోటీగా మహేష్ భరత్ అనే నేను కూడా రాబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: