జీవితంలో మరపురాని రోజులంటూ కొన్ని ఉంటాయి. బాల్యంలో ఆటపాటలు, కుర్రతనంలో చిలిపి చేష్టలు.. వీటిలో కొన్ని.. ఇక కాలేజ్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని మధురఘట్టంగా మిగిలిపోతుంది. అప్పుడప్పుడే అడుగుపెడుతున్న ప్రాయం.. ఎవరిని అడగాలో తెలియని కన్ ఫ్యూజన్స్ ఎన్నో.. స్నేహితుల అల్లరి.. జోకులు.. నవ్వులు .. తుళ్లింతలు.. అందుకే ఈ కాలేజ్ లైఫ్ కథాంశంగా ఎన్ని కథలు వచ్చినా అది ఎవర్ గ్రీన్ సబ్జక్టే.

ఎవరీ ప్రియా ప్రకాశ్ వారియర్
ఇప్పుడు ఇదే కథాంశంతో మళయాలంలో వస్తున్న ఒరు అదర్ లవ్ సినిమా పాట ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 80 లక్షలకు పైగా వ్యూస్ తో ట్రెండింగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ కాలేజ్ లైఫ్ ను గుర్తు తెచ్చుకుంటూ దాన్ని షేర్ చేసుకుంటున్నారు. అందులో ప్రధానంగా హీరోయిన్ చిలిపిగా కన్నుకొట్టే సీన్ కు అంతా అడ్డంగా పడిపోతున్నారు. 

యువత గుండెను పిండేస్తున్న ప్రియ
ఓ ప్రాంతీయ చిత్రానికి సంబంధించిన పాట ఈ స్థాయిలో దూసుకుపోవడం అంటే మాటలు కాదు. ప్రేమలో ఉన్న ఇద్దరు స్కూలు టీనేజ్ జంట ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అబ్బాయి చిలిపిగా అమ్మాయిని టీజ్ చేస్తూ కనుసైగలు చేయడం.. అందుకు దీటుగా ఆ అమ్మాయి కూడా చిలిపిసైగలు చేయడం.. ఆ ప్రయత్నంలో ఏకంగా అబ్బాయికి కన్నుగొట్టడం.. అలా సాగిపోతోందీ పాట. ముఖ్యంగా హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు అంతా ఫిదా అవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: