మెగా ఫ్యామిలీ నుండి హీరోలే ఎంట్రీ ఇచ్చి హంగామా చేస్తుండటంతో ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా వచ్చి అలరించింది నిహారిక. ముందు వెబ్ సీరీస్ ఆ తర్వాత ఈటివి డ్యాన్స్ షో వ్యాఖ్యాతగా టాలెంట్ చూపిన కొణిదెల వారసురాలు ఒక మనసు సినిమాతో వెండితెర మీద మెరుపులు మెరిపించింది. రామరాజు డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా అంతగా ఇంప్రెస్ చేయలేదు.


ఇక ప్రస్తుతం నిహారిక తన సెకండ్ మూవీ చేస్తుంది. సుమంత్ అశ్విన్ హీరోగా హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నటిస్తుంది అమ్మడు. లక్ష్మణ్ కార్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 14 అనగా రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబందించిన ప్రీ లుక్ తో సర్ ప్రైజ్ చేశారు చిత్రయూనిట్.


మెగా డాటర్ గా అభిమానులను అలరిస్తున్న అమ్మడు కోలీవుడ్ లో కూడా తన మొదటి సినిమా చేస్తుంది. ఇక మరో పక్క హ్యాపీ వెడ్డింగ్ లో కూడా నటిస్తుంది. యువి క్రియేషన్స్ వారు నిర్మాణంలో కాబట్టి సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈమధ్యనే భాగమతిగా బాక్సాఫీస్ ను షేక్ చేసేలా సినిమా చేసిన యువి క్రియేషన్స్ ఇప్పుడు హ్యాపీ వెడ్డింగ్ తో యువత మనసు గెలవనున్నారు. 


ఇక ప్రభాస్ సాహో సినిమాను కూడా యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత సుజిత్ డైరక్షన్ లో సాహో వస్తుంది. యువి క్రియేషన్స్ అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యానర్. మరి ఈ బ్యానర్ నుండి వస్తున్న హ్యాపీ వెడ్డింగ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: