భారీ బడ్జెట్ సినిమాలకు లీకుల హంగామా అందరికి తెలిసిందే. సినిమా రిలీజ్ అవడానికి ముందే స్టోరీ, సీన్స్ లీకులతో నానా హడావిడి చేస్తున్నాయి. రిలీజ్ తర్వాత పైరసీనే ఆపలేకపోతుంటే రిలీజ్ కు ముందు ఈ లీకులను ఆపలేకపోతున్నారు. చిత్రయూనిట్ కు సంబందించిన వారే ఈ లీకులకు కారణమని తెలుస్తుంది.


ఇక ప్రస్తుతం తలైవా రజినికాంత్ హీరోగా పా. రంజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కాలా. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ లీక్ సంచలనంగా మారింది. రజిని ఫైట్ చేస్తున్న సీన్ ఎలాగో బయటకు వచ్చింది. అయితే ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది అన్నది తెలియాల్సి ఉంది. కబాలి తర్వాత రంజిత్ డైరక్షన్ లో రజిని చేస్తున్న సినిమా కాలా.


ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కు ఎక్కువ ఫోకస్ పెట్టారు.  మంటల్లో విలన్ తో ఓ ఫ్యాక్టరీతో రజిని ఫైట్ చేస్తున్న సీన్ లీక్ అయ్యింది. అయితే ఈ సీన్ లీక్ అవడంతో రజిని ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సింది పోయి వీడియోని ఇంకా ఎక్కువ షేర్ చేస్తున్నారు. రజినికాంత్ డాన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను ధనుష్ నిర్మిస్తున్నారు.


కబాలి తర్వాత రంజిత్, రజిని ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలైతే తారాస్థాయిలో ఉన్నాయి. ఏప్రిల్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇక శంకర్ డైరక్షన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ సినిమా మరోసారి వాయిదా పడినట్టు తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: