మెగా ఫ్యామిలీ హీరోల్లో ప్రస్తుతం ఫుల్ సక్సస్ లో ఉన్న హీరో ఎవరు అంటే వరుణ్ తేజ్ పేరే వినిపిస్తుంది. ఫిదా, తొలిప్రేమ లాంటి కంటిన్యూస్ హిట్స్ తో వరుణ్ తేజ్ కెరీర్ ఇప్పుడు హై స్పీడ్ లో దూసుకెళ్తుంది.  అయితే వరుణ్ సక్సస్ ని అభిమానులు, తోటి ఫ్యామిలీ హీరోలు ఎంత ఎంజాయ్ చేసినా ఒక్క వ్యక్తికి  మాత్రం ఆ ఆనందం ఆకాశాన్ని దాటేసి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆయనే వరుణ్ తండ్రి నాగబాబు. కొడుకు విజయానికి తండ్రి ఉప్పొంగి పోవడం అన్న విషయం సాధారణ విషయమే . అయితే వరుణ్ విషయంలో నాగబాబు ఇలా రెట్టింపు ఆనందాన్ని పొందటానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. 

Image result for Varun Tej

ముగ్గురు మెగా హీరోల్లో పేరుకి ఒక్కడైనా..  నాగబాబు మాత్రం ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఎప్పుడు  మెగాహీరో కాలేకపోయాడు! ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే అప్పట్లో చాలా తక్కువ సమయంలోనే ఆయన్ని ప్రేక్షకులు హీరోగా రిజక్ట్ చేసేశారు. ఇక అప్పటి నుండి నాగబాబు పరిశ్రమలో ఒక ఆర్టిస్ట్ గా మాత్రమే కంటిన్యూ అవుతూ వచ్చాడు. మెగాస్టార్ తమ్ముడిగా, పవర్ స్టార్ అన్నయ్యగా ఆయనకి గౌరవ మర్యాదలు బాగానే దక్కినా,  తనకంటూ ఓన్ ఐడెంటిటీ లేకుండాపోయింది. ఇక ఆర్ధికంగా కూడా నాగబాబు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఇలా మిగతా ఇద్దరి అన్నదమ్ములతో పోలిస్తే నాగబాబు అన్ని విషయాల్లో బాగా వెనుకపడిపోయే జీవితంతో పోరాటం చేస్తూ వచ్చారు. అయితే ఇన్ని కష్టాల నడుమ కూడా ఈ నవ్వుల రారాజు లైఫ్ మీద నమ్మకాన్ని వదుకోలేదు. బాధ్యతలని మోసాడు, బాధలని భరించాడు. 

Related image

అయితే ఇన్నేళ్ల తరువాత నాగబాబు సాధించలేని విజయాన్ని ఆయన కొడుకుగా  వరుణ్ తేజ్ హీరోగా నిలదొక్కుకొని, ఈరోజు స్టార్ హోదాను సాధించి తండ్రికి ఎక్కడ లేని సంతోషాన్ని అందించాడు. మిగతా మెగా హీరోలకి దీటుగా నిలిచే స్థాయి వరుణ్ ది అంటుంటే నాగబాబుకి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి ? అందుకే వరుణ్  సక్సస్ అందరికన్నా నాగబాబుకి వెరీ వెరీ స్పెషల్ . 



మరింత సమాచారం తెలుసుకోండి: