బుల్లితెర పై తిరుగు లేని యాంకర్ గా తన మాటలతో అందరిని ఆకట్టుకునే యాంకర్ ప్రదీప్ అంటే అందరికీ సుపరిచితమే. కెరీర్ ఆరంభంలో ఆర్జే గా జీవితాన్ని మొదలుపెట్టి యాంకర్ గా అటు తరువాత ఒక ప్రొడక్షన్ ను పెట్టే వరకు ఎదిగాడంటే ఎవరికైనా అతని జీవితం ఒక స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం తెలుగులో బుల్లితెరపై ఎటువంటి మసాలాలు, ద్వందార్థాలు వచ్చే డైలాగ్ లు వాడకుండా యాంకరింగ్ చేసే మేల్ యాంకర్ బహుశా ప్రదీపే కావచ్చు.


యాంకర్ గా దుమ్మురేపుతున్న ప్రదీప్ కు  ఈ సంవత్సరం కలిసిరాలేదనే చెప్పాలి. ఎందుకంటే శుభమా అని కొత్త సంవత్సరం వేడుకలు హుషారుగా జరుపుకుని తిరిగి ఇంటికి వస్తున్న టైములో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో ప్రదీప్ 178 పాయింట్లు నమోదవడంతో అతని కారు సీజ్ చేసి అతని మీద కేసు బుక్ చేశారు. నీతులు చెప్పి గోతిలో పడ్డాడు అని అప్పటిలో బాగనే కథనాలు వెలువడ్డాయి. 


ఇక ఆ భయంకరమైన అవమానాన్ని మర్చిపోతున్న టైములో ప్రదీప్ కు యింకో షాక్  తగిలింది. ఈ షాక్ తో ప్రదీప్ కుటుంబం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయట. అదేంటంటే ప్రదీప్  నానమ్మ గారు ఈరోజు కన్నుమూశారని ఈ మేరకు ఇంటర్నెట్లో  వార్తలు  చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త లో నిజమెంత ఉందో ఇంకా  తెలియాల్సి ఉంది . శివరాత్రి పండుగ  దినాన  ప్రదీప్ నానమ్మను పోగొట్టుకోవడం, కొత్త సంవత్సరంరోజు ప్రదీప్ పట్టుబడడం వీటన్నిటిని చూస్తే ప్రదీప్ కు ఈ సంవత్సరం కలిసిరానట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: