సన్నీ లియోన్.. ఇప్పటికీ ఇండియాలో హాట్ స్టార్.. భారత్ లో కుర్రకారు ఇంకా సన్నీ లియోన్ అందాలను ఇప్పట్లో మరిచిపోయేలా లేరు. ఇండియాలో గూగుల్ లో టాప్ మోస్ట్ సెర్చ్ డ్ సెలబ్రెటీగా సన్నీ లియోన్ తన రికార్డును కొనసాగిస్తూనే ఉంది. ఆమె తర్వాత వరుసలో దీపికా పదుకునే, ఆలియా భట్, కత్రినా కైఫ్ వంటి వారు ఉంటుంటారు. 


కానీ ఇప్పుడో చిన్నది సన్నీలియోన్ ను వెనక్కు నెట్టేసింది. ఇండియాలో మోస్ట్ సెర్చ్ డ్ సెలబ్రెటీగా క్రేజ్ సంపాదించుకుంది. ఇంతకీ ఎవరో ఆ చిన్నది అనుకుంటున్నారా.. ఆ చిన్నది ఎవరో కాదు.. ఒక్క కన్నుగీటుతోనే ఇండియాలో హాటెస్ట్ హీరోయిన్ గా మారిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్. అవును. ఈ ఒక్కరోజు ఆమె గురించి గూగుల్ లో కుర్రకారు తెగవెదికారట. ప్రియా తర్వాతి ప్లేస్ లో సన్నీలియోన్, దీపికా పదుకునే, ఆలియా భట్, కత్రినా కైఫ్ ఉన్నారట. 

priya prakash కోసం చిత్ర ఫలితం
ఈ చిన్నది నటించిన ఒరు అదార్ లవ్ అనే సినిమాలోని మాణిక్య మలరారయ పూవై అనే పాట వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ పాటలో ఓ కుర్రాణ్ని ఓ కన్ను కొట్టి పడేసిన సీన్ ఇప్పుడు ఇంటర్నెట్ లో మోస్ట్ ట్రెండింగ్ వీడియోగా మారింది. భాషతో సంబంధం లేకుండా ఆ పాట ను కుర్రకారు తెగ చూసేస్తున్నారు. దీంతో ప్రియా వారియర్ ఒక్కరోజులోనే క్రేజీ స్టార్ గా మారిపోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: