పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు చేయనని చెబుతుంటే.. ఆయనతో సినిమా చేయాలంటూ కోరుకునే వారి సంఖ్య పెరుగుతుంది. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ సొదరి మంజుల మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా, అమైరా దస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా మనసుకి నచ్చింది.


ఈ సినిమాతో మొదటిసారి దర్శకత్వ బాధ్యత మీద వేసుకున్నారు మంజుల. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ కు ఓ కథ రాశానని.. ఆయన ఒకసారి ఈ కథ వింటే తప్పకుండా చేస్తారని అంటుంది. అయితే అంతగా పవన్ ను ఇంప్రెస్ చేసే కథ ఏంటి అంటే.. ఆమె రాసింది మరేదో కాదు పవన్ జీవిత చరిత్రే అంటున్నారు.


సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి రాజకీయాల్లోకి వెళ్లే దాకా పవన్ గురించి అబ్జర్వ్ చేసి మంజుల ఈ కథ రాసుకున్నారట. అయితే పొలిటికల్ ఇంకా పవన్ ఏమి పోటీ చేయలేదు. ఎక్కడ గెలవలేదు. మరి అలాంటిది ఆయన జీవిత కథ ఎలా అంటే.. ఆయన స్టైల్ ను ప్రమోట్ చేస్తూ.. ఆయనంటే ఏంటో చూపించేలా ఈ కథ ఉంటుందని చెబుతుందట.


మరి పవన్ మంజుల రిక్వెస్ట్ ను ఓకే అంటాడా లేదా అన్నది చూడాలి. ఇక కుదిరితే తమ్ముడు మహేష్ ను కూడా డైరెక్ట్ చేస్తా అంటుంది మంజుల. మొదట హీరోయిన్ గా చేద్దామని అనుకుని సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ వద్దనేసరికి సపోర్టింగ్ రోల్స్ కు పరిమితమైన మంజుల. నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు.. ఇక ఇప్పుడు కొత్తగా డైరక్షన్ చేశారు. ఈ నెల 16న మంజుల డైరెక్ట్ చేసిన మనసుకి నచ్చింది సినిమా రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ బాగా చేస్తున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: