సోషల్ మీడియాలో ఇప్పుడు ఎటుచూసినా ఒక అమ్మాయే కనపడుతుంది కదా! మరి ఆ అమ్మాయి కళ్ళకు, నవ్వుకి ఉన్న పవర్ అలాంటింది. అవును మీరు ఊహించింది నిజమే! ఆమెనే ప్రియ ప్రకాష్ వారియర్. ఇంకా సినిమానే విడుదల అవలేదు, కేవలం ఒక్క ట్రైలర్ తోనే దేశాన్ని మొత్తం తనవైపుకు తిప్పుకుంది. దాదాపు మూడు నిమిషాల వ్యవధి ఉన్న ట్రైలర్లో ఆమె కనిపించి, హంగామా చేసే సమయం 26 సెకండ్లు మాత్రమే అయినా ఆ చిన్న వ్యవధిలోనే తన చిలిపి చేష్టలతో కుర్రకారు హృదయాల్ని దోచుకుంది.


ప్రేమికుల రోజును పురస్కరించుకొని "ఒరు ఆధార్ లవ్" చిత్ర బృందం ఒక క్లిప్ ను విడుదలచేసింది. ట్రైలర్లో కన్ను కొట్టి దేశాన్ని ఫిదా చేసిన ఈ భామ, ఇప్పుడు ఏకంగా హీరోని కాల్చేసింది! అంటే తన ముద్దుల తుపాకీ ద్వారా. క్లాసురూంలో హీరోని చూస్తూ ఒక ముద్దుని బుల్లెట్ లాగా తుపాకీలో లోడ్ చేసి హీరోని కాల్చగా, హీరో దానికి తగినట్లుగా మతిపోయేలా కిందపడే సీన్ ను చిత్ర బృందం నిన్న రాత్రి విడుదలచేసింది.


విడుదలచేసిన గంటలోపు కూడా కాదు, నిమిషాల్లోనే ఈ క్లిప్ అన్ని సామాజిక మధ్యమాలలో విపరీతంగా షేర్ అయింది. ఇక హీరోయిన్ విషయానికొస్తే ఇంస్టాగ్రామ్లో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య గంటగంటకు పెరిగిపోతూ ఉంది. ఇప్పటికి ఆమెకు 2.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటికే కొన్ని జాతీయ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తుంది. ఈ అభిమానాన్ని తాను భలే ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడు స్పీడు చూస్తుంటే తెలుగులో అడుగుపెట్టడానికి ఎంతోకాలం పట్టదని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: