టాలీవుడ్ ఇండస్ట్రీలో రన్ సినిమాతో కుర్రకారు మనసులు దోచిన మళియాళీ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్..ఆ తర్వాత పవన్ కళ్యాన్ నటించిన గుడుంబా శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.  'భద్ర', 'అమ్మాయి బాగుంది' లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించింది.   మీరా జాస్మిన్ 2014లో  పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.   
Image result for meera jasmine
ఈ కేరళ కుట్టి అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది. అందుకే తెలుగు ప్రేక్షకులకు తక్కువ సినిమాలు తీసినా తొందరగా కనెక్ట్ అయింది. తెలుగు, తమిళ, మళయాళ సినిమాలన్నిటిలో ఛాన్సులు దక్కించుకుని అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న మీరా ఇప్పుడు చూడటానికి చాలా బొద్దుగా తయారైంది.

తాజాగా ఆమె ఓ జువెలరీ షాప్ లో తళుక్కుమంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎంతో నాజూకుగా ఉన్న ఇప్పుడు గుర్తు పట్టరాకుండా ఉంది.  అయినప్పటికీ చీర కట్టులో ఎంతో హుందాగా, అందంగా కనిపించింది. ప్రస్తుతం ఆమె తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related image


మరింత సమాచారం తెలుసుకోండి: