టాలీవుడ్ లో సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు  పవన్ కల్యాణ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుస పర్యటనలు, మీటింగులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.  ఇండస్ట్రీలో పవన్ నటించిన సినిమాలు హిట్ అయినా..ఫ్లాప్ అయినా..మంచి క్రేజ్ ఉంటున్న విషయం తెలిసిందే.  సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయినా..అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.  ఆ తర్వాత కాటమరాయుడు..ఈ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ కూడా అంచనాలు తారు మారు చేసింది.  దీంతో పవన్ కళ్యాన్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనున్నాడని వార్తలు వచ్చాయి.
Image result for pawan kalyan
ఇదిలా ఉంటే..వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల తరుపు నుంచి పోటీ చేయనున్న పవన్ కళ్యాన్ ఇప్పటికే పార్టీ పటిష్టత కోసం పర్యటనలు చేస్తున్నారు.  దీంతో ఇక పవన్ కళ్యాన్ తెరపై చూడలేమనుకున్న ఫ్యాన్స్ కి శుభవార్త. సినీ వర్గాలు మాత్రం పవన్ కల్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోనున్నారని చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, నెల, నెలన్నర కాలంలో ఒక కొత్త సినిమా చేయబోతున్నారని అంటున్నాయి. అటు పవన్ కూడా పరిమిత సంఖ్యలోనే కాల్షీట్లు ఇచ్చినట్లు చెబుతున్నాయి.
Image result for pawan kalyan
కాకపోతే ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది మాత్రం కాస్త సస్పెన్స్. ఎ.ఎమ్ రత్నం నిర్మాణంలో ఇదివరికే ఓ సినిమాకు కమిట్ అయిన వపన్ కల్యాణ్ ఆ మూవీకి కొబ్బరికాయ కొట్టిన ఆ సినిమాను పవన్ చేయడం లేదని, అందుకే నిల్చి పోయిందని ప్రచారం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో  ఎంత బిజీగా ఉన్నా పవన్ మాత్రం సినిమాలు చేస్తూనే ఉండాలని అభిమానులు కోరుతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: