నేచురల్ స్టార్ నాని క్రేజి హీరోయిన్ కాజల్ కలిసి నటించిన సందర్భాలు గతంలో లేవు దీనితో వీరిద్దరి రిలేషన్ షిప్ పై ఇప్పడివరకూ ఎక్కడా వార్తలు రాలేదు. దీనికితోడు వీరిద్దరూ ఏదో ఒక ఫంక్షన్ లో కలుసుకుని సందడి చేసిన సందర్భాలు లేవు.  అయితే కాజల్ హీరో నానీ పై చేసిన కామెంట్స్ అందరి దృష్టి నీఆకర్షిస్తోంది. 

తమ మధ్య బంధం బయటకు కనిపించేది కాదని ఎంతో భావోద్వేగంతో కూడినదని చెబుతోంది కాజల్. ఈవారం విడుదల కాబోతున్న ‘అ’ సినిమాను ప్రమోట్ చేస్తూ కాజల్ నానీ పై ఈ ఆసక్తికర కామెంట్స్ చేసింది. "నేను, నాని పెద్దగా కలుసుకోలేదు. బయట పార్టీల్లో కూడా మేం ఒకసారి మాత్రమే కలిసినట్టు గుర్తు. అప్పుడు కూడా పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ మేమిద్దరం ఎమోషనల్ గా చాలా క్లోజ్. ఎందుకంటే మా ఇద్దరి మైండ్ సెట్ ఒకటే. మా ఇద్దరికీ పనే లోకం. ఒకరి లైఫ్ స్టయిల్ ఏంటో మరొకరికి తెలుసు." అంటూ నానీని ఆకాశంలోకి ఎత్తేస్తోంది కాజల్.
KAJAL LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే కాజల్ కామెంట్స్ పై నానీ స్పందిస్తూ 'అ' సినిమా సెట్స్ లో మాత్రమే తామిద్దరం ప్రొఫెషనల్ గా కలుసుకున్నామని, అప్పటివరకు కాజల్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడే సందర్భం రాలేదని అంటున్నాడు నాని. అదీ కాకుండా 'అ' సెట్స్ లో కూడా కేవలం ఒకసారి మాత్రమే తాను కాజల్ ను చూసి పలకరించాను అని చెపుతున్నాడు నాని. 
సంబంధిత చిత్రం
అయితే ఇంత తక్కువ పరిచయంతో నానీ కాజల్ ల మధ్య ఎమోషనల్ రిలేషన్ షిప్ ఎప్పుడు డెవలప్ అయింది అంటూ కాజల్ కామెంట్స్ పై కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి కాజల్ ‘అ’ సినిమా కోసం పనిచేసింది కేవలం 5 రోజులు మాత్రమే అని టాక్. అయితే ఈసినిమాకు సంబంధించిన అసలు స్టోరీ క్లైమాక్స్ ఏమిటో మాకు తెలియదు అని ఈ సినిమాలో నటించిన అందరూ చెపుతుంటే కాజల్ మాత్రం తనకు 90 శాతం 'అ' స్టోరీ తెలుసంటోంది. ఏది ఏమైనా ప్రస్థుతం కాజల్ బయట పెట్టిన నానీతో ఎమోషనల్ రిలేషన్ షిప్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: