నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మొదటి ప్రయత్నం చేస్తున్న సినిమా అ!. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాజల్, రెజినా, నిత్యా మీనన్, ఈషా రెబ్బలతో పాటుగా అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, మురళి శర్మలు నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా నిర్మాతగా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెబుతున్నాడు నాని.


ఈ కథే తనని నిర్మాతగా మార్చిందని.. తను పెట్టిన వాల్ పోస్టర్ సినిమా ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తుందని. రెగ్యులర్ సినిమాలు కాకుండా ఎవరైనా సరే కొత్త కథతో తన దగ్గరకు వస్తే ఈ బ్యానర్లో సినిమాలు చేసేందుకు తాను సిద్ధమని అన్నాడు నాని. కొత్త కథలు ఎవరొచ్చి చెప్పినా తాను నిర్మిస్తానని అంటున్నాడు.


అయితే కొత్తవాళ్లు కూడా కొత్తగా ఆలోచించడం మానేశారు. మూస కథలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో తాను ఈ నిర్మాణ సంస్థ పెట్టానని. కొత్త వారికి అవకాశం ఇస్తానని అన్నాడు నాని. అయితే నాని ఈ ప్రయత్నం ముందుకు సాగాలంటే అ! సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వాలి. 


చిత్రయూనిట్ అంతా సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుంటే నాని హీరోగా కాదు నిర్మాతగా కూడా సక్సెస్ అయినట్టే. మొత్తానికి నాని ఫుల్ టైం నిర్మాతగా మారాలని చూస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: