ఈ మద్య సోషల్ మీడియాలో ‘ ఒరు అదర్ లవ్‌లోని మాణిక్య వలరయ’ అనే పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పాటలో  ప్రియా ప్రకాశ్ పలికించిన హావభావాలకు యువత ఫిదా అయింది. సోషల్ మీడియాలో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయింది. ఈ మళియాళ ముద్దుగుమ్మకు సామాన్య పౌరుల నుంచి సెలబ్రెటీల వరకు ఫిదా అయ్యారు.   ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట దుమ్ము రేపుతోంది. అయితే ఈ పాట తమ మనోభావాలు దెబ్బతీస్తోందంటూ హైదరాబాదులోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో మహమ్మద్ ముఖీత్ అనే ఇరవై ఏళ్ల విద్యార్థి కొందరు స్నేహితులతో కలిసి ఈ ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు, పోలీసులు ఏం చెప్పారంటే
 మలయాళ చిత్రం ఒరు అదర్ లవ్‌లో ముస్లీంలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయని వారు పేర్కొన్నారు.  ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దానిని పరిశీలన కోసం ఉన్నతాధికారులకు పంపించారు. నటి ప్రియ యాక్షన్ విషయంలో తమకు అభ్యంతరం లేదని తెలిపారు.హైదరాబాదులో తన సినిమా విషయంలో ఫిర్యాదుపై నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా స్పందించారని తెలుస్తోంది.  ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో కన్ను గీటిన సన్నివేశాలు ఉన్నాయని.
దర్శకుడిపై ఫిర్యాదు
ఊహించని పాపులారిటీకి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని, కన్ను గీటే సీన్‌ను రిహార్సల్స్ చేయకుండానే చేశానని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇంతమంది ఇష్టపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపింది. ఆ పాటలో ముస్లింల మనోభావాలను మీరు కించపరిచారనే ఆరోపణలపై మీరేమంటారని ప్రశ్నించగా.. ‘‘ఆ కేసు గురించి నాకు పెద్దగా తెలీదు. డైరెక్టర్ చెప్పిందే చేశాను’’ అని తెలిపింది.
ఫిర్యాదుపై ప్రియాప్రకాశ్ వారియర్ ఏం చెప్పారంటే
ఆ పాటలో మీ హవభావాలు అసభ్యకరంగా ఉన్నాయని కూడా ఫిర్యాదు చేశారని తెలపగా.. ‘‘అస్సలు కాదు, అందులో ఎలాంటి అసభ్యత లేదు. దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారు’’ అని తెలిపింది. అది ముస్లిం సాంప్రదాయ గీతమని మాత్రం తెలుసని, దాన్ని అవమానించామని మేం భావించడం లేదని ప్రియా తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: