టాలీవుడ్ లో అక్కినేని వారి కోడలు అయ్యాక కూడా ఈ భామ ఇటు తెలుగు అటు తమిళ భాషా సినిమాలతో బిజీగా గడుపుతోంది. సమంత ప్రస్తుతం తెలుగులో రంగస్థలం సినిమాతో పాటు, తమిళంలో రూపొందుతున్న విశాల్ అభిమన్యుడు సినిమా  కూడా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగులో కూడా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘యాంగ్రీబర్డ్‌’ పాట వీడియో ప్రోమోను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. విశాల్‌, సమంత మధ్య జరిగే సరదా సన్నివేశాలను ఇందులో చూపించారు.
పెళ్ళయాక కూడా
తనదైన హావభావాలతో సమంత అభిమానులను మరోసారి మెస్మరైజ్ చేసింది. ఇక సమంత తన నటనతో అభిమానులని ఆశ్చర్య పరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజగా సమంత పోషిస్తున్న మరో ఛాలెంజింగ్ రోల్ రంగస్థలం చిత్రంలోని రామలక్ష్మి. ఇటీవలే సమంత పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ అబ్బుర పరిచింది.
అదిరిపోయిన టీజర్

ఈ చిత్రంలో విశాల్, సమంత మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.  రెండు నిమిషాల ఈ వీడియోని చూసినంత సేపు మైమరచిపోయి సమంత మాయలో పడడం ఖాయం.  రంగస్థలం చిత్రంలో సమంత రామలక్ష్మి పాత్రని పరిచయం చేస్తూ ఇటీవల టీజర్ విడుదల చేశారు.   మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఆ మాయనుంచి బయటకు రాక ముందే అభిమన్యుడి చిత్ర టీం ఈ వీడియో విడుదల చేసారు.

రామలక్ష్మి మాయ నుంచి బయటకు రాక ముందే

 ఏం మాయ చేసావె’తో మాయ చేసిన సమంత.. మరోసారి ఆ స్థాయిలో ‘మాయ’ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు అర్జున్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. యాక్షన్‌ టెక్నో థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: