‘జనసేన’ అధినేత పవన్‌ కళ్యాణ్ విధించిన డెడ్‌లైన్ నేటితో పూర్తి అయిపోతున్నా  అటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ ఎటువంటి స్పందన రాక పోవడంతో పవన్ తదుపరి కర్యాచరణ ఎలా ఉండబోతోంది అన్న విషయమై సినీ రాజకీయ వర్గాలలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది గంటలలో పవన్ డెడ్ లైన్ ముగింపుకు వస్తున్నన నేపధ్యంలో  పవన్‌ను రెండు ప్రభుత్వాలు లైట్ గాతీసుకున్నాయన్న సెటైర్లు పడుతున్నాయి. 
PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
కేంద్రం నుంచి ఇప్పటిదాకా ఏపీకి వచ్చిన నిధులపై బీజేపీ, టీడీపీల్లో ఒక పార్టీ అబద్ధం చెబుతోందని పవన్ కామెంట్స్ చేయడమే కాకుండా 15వ తేదీలోగా కేంద్రం, రాష్ట్రాలు  సరైన లెక్కలతో  ప్రజలకు వాస్తవాలు వివరించాలి అని పవన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధుల లెక్కలు తేల్చేందుకు ‘జనసేన’ అధినేత పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసిన నేపధ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు వాటిని ఎలా ఖర్చు చేశారన్న దానిపై సమగ్ర వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వాలని పవన్ కోరడమే కాకుండా 15లోగా ఈ వివరాలు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.    
PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈవిషయాల పై ప్రభుత్వాలు స్పందించకపోతే ఏం చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందిస్తామని పవన్‌ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటనలు ఇచ్చాడు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే పవన్  ఉండవల్లి అరుణ్‌కుమార్, జయప్రకాశ్ నారాయణతో సమావేశం అయిన తరువాత రేపు సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణలతో పవన్ సమావేశం కాబోతున్నాడు. ఈ సమావేశంలో లోక్‌ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా పాల్గొని పవన్ కు తమసహాయ సలహాలను అందిస్తారని టాక్.   
PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా ఏపీ డిమాండ్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ పై ముఖ్య మంత్రి చంద్రబాబు స్పందింఛినట్లు వార్తలు వస్తున్నాయి. ‘పవన్ జేఎఫ్‌సీతో మనకు ఇబ్బంది లేదు. పవన్ పోరాటంలో అర్థం ఉంది. రాష్ట్రానికి మేలు చేయాలని పవన్ పోరాటం చేస్తున్నారు.’’ అనికొందరు ముఖ్య  నేతలతో చంద్రబాబు కామెంట్ చేసినట్లు టాక్. దీనితో పవన్ ఈవిషయాల పై మరింత వేగం పెంచుతాడా లేదంటే మళ్ళీ తిరిగి మౌన ముద్రలోకి వెళ్లిపోయి ఈ గాప్ లో మరో సినిమాను చేసే తన వ్యూహాన్ని కొనసాగిస్తాడా అన్న విషయం పై రకరకాల భిన్న కధనాలు వినిపిస్తున్నాయి 



మరింత సమాచారం తెలుసుకోండి: