యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి బిఫోర్ బాహుబలి ఎవరికి తెలిసినా తెలియకున్నా ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన బాహుబలి మొదటి, రెండు పార్టులు ప్రభాస్ కు నేషనల్ వైడ్ ఫాలోయింగ్ తెచ్చాయి. ఇక ఆ సినిమా వసూళ్ల హంగామా.. సృష్టించిన రికార్డులు తెలిసిందే.


ప్రభాస్ గురించి అందరు అన్నివిధాలుగా పొగుడుతూ వచ్చారు. లేటెస్ట్ గా మలయాళ భామ నివేదా థామస్ కూడా ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తింది. బాహుబలిగా ప్రభాస్ ఒక్కడే చేయగలడని. ఆయన సెలెక్ట్ చేసుకునే సినిమాలు అతని రేంజ్ పెంచుతున్నాయని అన్నది నివేదా థామస్. జెంటిల్మన్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ అమ్మడు నిన్ను కోరి, జై లవ కుశ సినిమాల్లో నటించింది.


ఇక ఎన్.టి.ఆర్ కూడా ఎంతో ఎనర్జీగా ఉంటారని.. తనతో సినిమా చేయడం లక్కీ అని అంటుంది నివేదా. ఇష్టమైన కోస్టార్ గా కమల్ హాసన్ పేరు చెప్పింది నివేదా. పాపనాశం సినిమాలో కమల్ హాసన్ తో కలిసి నటించింది నివేదా. నాని అయితే తన కుటుంబంలో ఒకరు అంటూ చెప్పుకొచ్చింది.


తెలుగులో రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయని చెప్పిన నివేదా త్వరలోనే వాటికి సంబందించిన విషయాలము వెళ్లడిస్తానని చెప్పింది. చేసిన 3 సినిమాలు హిట్ అవడంతో తెలుగులో నివేదా థామస్ కు క్రేజ్ బాగానే ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: