ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ , మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మంచి ఫ్రెండ్స్ అన్న విష‌యం తెలిసిందే. ఒక‌రంటే ఒక‌రికి ఎంతో అభిమానం, ప్రేమ . వీరిద్ద‌రు అత్యంత ప్రాణ‌స్నేహితులు. వీరిద్ద‌రి ఆలోచ‌న‌లు ఒక‌టే కావ‌డంతో మంచి ఫ్రెండ్స్ అయ్యార‌నే చ‌ర్చ సినీ వ‌ర్గాల్లో జ‌రుగుతూ ఉంటుంది. అయితే ప‌వ‌న్ , త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అన‌గానే సినీ ప్రేమికుడి ప్ర‌తిక్క‌రికి ఆస‌క్తి క‌లుగుతోంది. ఈ ఇద్ద‌రి కాంబో అంటే ఇటూ సినీ వ‌ర్గాల‌తో పాటు, అభిమానుల్లోనూ భారీగా అంచ‌నాలు ఉంటాయి. గ‌తంలో వీరిద్ద‌రు తీసిన సినిమాలు హిట్ కావ‌డంతో ఈ కాంబినేష‌న్ కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఏర్ప‌డింది.

Image result for trivikram srinivas ntr

జ‌ల్సా, తీన్ మార్, అత్తారింటికి దారేది సినిమాలు వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో స‌క్సెస్ అయ్యాయి. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన అజ్ఞాత‌వాసి సినిమా ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. . ప‌వ‌న్ ను ఢిప‌రేంట్ లుక్ లో చూపించ‌డంతో త్రివిక్ర‌మ్ స్ట్రైల్ వేరేగా ఉంటుంది. అలాగే త్రివిక్ర‌మ్ డైలాగ్ లు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బాగా సూట్ అవుతున్నాయి. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమాపై భారీగానే అంచ‌నాలు ఉంటాయి. అయితే అజ్ఞాత‌వాసి సినిమా ప‌వ‌న్ అభిమానుల అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేసింది.

Image result for trivikram srinivas ntr

వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కు, త్రివిక్ర‌మ్ హిట్ ఇస్తార‌ని అంద‌రూ భావించారు. అభిమానులు. కానీ అజ్ఞాత‌వాసి ప‌రాజ‌యం కావ‌డంతో ప‌వ‌న్ అభిమానులు నిరుత్సాహంలో ప‌డిపోయారు. ఇక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌స్తుతం ప‌వ‌న్ సినిమాలు చేసే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. పూర్తిగా రాజ‌కీయాల‌పైనే దృష్టి సారించ‌నున్నారు.


అయితే అజ్ఞాత‌వాసి ప్లాప్ అవ‌డం ఎన్టీఆర్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతోంది. ఎందుకంటే ప్ర‌స్తుతం ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ తో సినిమా చేస్తున్నారు. అస‌లే ఇప్పుడు ఎన్టీఆర్ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో త్రివిక్రమ్ తెర‌కెక్కించిన అజ్ఞాత‌వాసి ప్లాప్ అవ‌డం ఎన్టీఆర్ అభిమానులను ఆందోళ‌న క‌లిగిస్తుంది. అజ్ఞాత‌వాసి సినిమా చూసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ త్రివిక్ర‌మ్ ను ఏం రేంజ్ లో విరుచుకుప‌డ్డారో తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: