నాచురల్ స్టార్ నాని నిర్మాతగా ఫస్ట్ టైం చేసిన మూవీ అ!. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి టైం లో నాని సినిమా చూసే ఆడియెన్స్ కు, రివ్యూ రైటర్స్ కు, ఓ విన్నపం చేశాడు. ఇది ఒక కొత్త ప్రయత్నం కచ్చితంగా మీకు నచ్చుతుంది.


అయితే ఆ ఫీల్ డైరెక్ట్ గా చూసే ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చేయండి. అంటే కథ విశ్లేషణలు అంటూ కథ ఎక్కడ రివీల్ చేయొద్దని ఆడియెన్స్ తో పాటుగా పనిలో పనిగా రివ్యూ రైటర్స్ ను వేడుకున్నా నాని. నాని చెప్పినట్టుగా కేవలం సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడం కష్టమే. మెయిన్ థీం అన్నది చెప్పకుండా రివ్యూస్ రాయమని రిక్వెస్ట్ చేశాడు.


ఆల్రెడీ పీమియర్ షోస్ లో డిఫరెంట్ మూవీ అన్న సౌండింగ్ వచ్చింది. అయితే ఇది కమర్షియల్ గా హిట్ అనిపించుకోవాలి అంటే కాస్త కష్టపడాల్సిందే. అందునా సినిమా చూశాక కూడా కథ చెప్పొద్దు అంటే కష్టమే. సినిమా ఓసారి చూశాక దాన్ని ఆడియెన్స్ అయినా షేర్ చేసుకోకుండా ఉండలేరు. ఇక సినిమా కథ ఇదని ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మాధ్యమాల్లో కూడా పెట్టొద్దని అంటున్నాడు నాని.


నిర్మాతగా నాని పెయిన్ అర్ధం చేసుకోవచ్చు. కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుందని నాని దగ్గరకు ప్రశాంత్ వస్తే సినిమా కథ నచ్చి తానే నిర్మించేశాడు. నాని నిర్మించాడు కాబట్టి సినిమాకు ఈ మాత్రం క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ప్రీమియర్స్ తో మంచి టాక్ సొంతం చేసుకున్న అ! సినిమా మొదటి షోతో అసలు టాక్ ఏంటో బయటకు వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: