నందమూరి బాలకృష్ణ అనాలోచితంగా చేసే కామెంట్స్ తో ఒకొక్కసారి తన సమస్యలు తానే కొని తెచ్చుకుని ఇరుకున పడుతూ ఉంటాడు. ఇప్పుడు అటువంటి సందర్భమే బాలకృష్ణకు మరొకసారి ఎదురైంది. బాలయ్యకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అంటున్నాడు. అనాలోచితంగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.
BALAKRISHNA LATEST PHOTOS IN JAI SIMHA కోసం చిత్ర ఫలితం
నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మాటలు బాలయ్య నోటివెంట రావడం మీడియా వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ఏపీకి ప్రత్యేక హోదా కోసం జేఎఫ్ఎఫ్‌సీ ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ పోరాటంపై మీ స్పందన ఏంటని వైజాగ్‌లో విలేకరులు బాలకృష్ణను ప్రశ్నించగా ‘పవన్ కళ్యాణా తను ఎవరో తెలీదు’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు. వెంటనే కార్లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 
BALAKRISHNA LATEST PHOTOS IN JAI SIMHA కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఈ విషయానికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. గతంలో ఎన్నికల ముందు పవన్ బాలకృష్ణ ఇంటికి వెళ్ళడం అప్పట్లో సంచలన వార్త. పవన్ ‘జనసేన’ పెట్టక ముందు తెలుగుదేశం పార్టీలోకి పవన్ ను తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు కూడ బాలకృష్ణ చేసాడు. టాలీవుడ్ ఎంపరర్ గా కోట్లాది మంది అభిమానులు కలిగిన పవన్ పేరు తనకు తెలియదు అని బాలకృష్ణ కామెంట్ చేసే స్థాయికి ఎందుకు వచ్చాడు అన్న విషయం పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 
BALAKRISHNA LATEST PHOTOS IN JAI SIMHA కోసం చిత్ర ఫలితం
రాబోతున్న ఎన్నికలలో పవన్ అనంతపురం జిల్లా నుండి పోటీ చేస్తాడు అన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలే నిజం అయితే హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ అనంతపురం జిల్లాలో ఒక క్రియాశీలక శక్తిగా ఎదిగిన బాలకృష్ణ రాజకీయ భవిష్యత్ కు పవన్ రాయలసీమ పొలిటికల్ ఎంట్రీ అడ్డు తగిలే ప్రమాదం ఉంది ఈ విషయాలు మనసులోకి రావడంతో బాలకృష్ణ అసహనంతో తనకు పవన్ ఎవరో తెలియదు అని కామెంట్ చేసి ఉంటాడు అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: