టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటులు చలపతిరావుకు ప్రమాదం జరిగింది.  రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరుగగా ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. షూటింగ్ లో భాగంగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా ఆయన కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్ చలపతిరావును అపోలో ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం చలపతిరావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లరి నరేష్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం.
chalapatirao
సినీయర్ నటులుగా విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించిన చలపతి రావు ఇప్పుడు హీరో, హీరోయిన్లకు తాతయ్య గా నటిస్తున్నారు.  ఆ మద్య అమ్మాయిలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద రాద్దాంతం సృష్టించింది. అంతే కాదు మహిళా సంఘాలు ఆయనపై పోలీస్ ఫిర్యాదు కూడా చేశాయి. కాగా, తాను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని..మహిళల మనోభావాలు దెబ్బతింటే తనను క్షమించాలని మీడియా ద్వారా తెలిపారు. 
chalapathirao minor accident in shooting
చలపతిరావు ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. సినిమా యూనిట్.. చలపతిరావు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుకుంటోంది. చలపతిరావు ఆరోగ్య పరిస్థితిని చిత్ర నిర్మాత, డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. చలపతిరావు ఆరోగ్యంపై హీరో నరేష్ వాకబు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: