ఈరోజు విడుదల అవుతున్న ‘అ’ సినిమాను ఏదో విధంగా హట్ సినిమాగా మార్చాలి అన్న ఉద్దేశంతో ఈ సినిమాను అన్నింటా తానై ప్రమోట్ చేస్తున్నాడు నాని. దీనికోసం తనకు అందుబాటులో ఉన అన్ని మీడియా సంస్థల సప్పోర్ట్ తీసుకుంటూ ఆ సినిమాను జనం మధ్యకు తీసుకు వెళ్ళడానికి ఏ ప్రయత్నం వదలడం లేదు నాని.  
NANI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న  ఒక ఆసక్తికరమైన కోరిక బయట పెట్టాడు. చిన్నప్పటి  నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమాని అయిన నాని చిరంజీవి నటించిన  సినిమాని రీమేక్ చేయాలనే తన కోరిక వెళ్లబుచ్చాడు. అది అలాంటి ఇలాంటి సినిమా కాదు. మెగాస్టార్ లోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్  గా ఆవిష్కరించి 1980 లలో వచ్చిన ‘చంటబ్బాయ్’ జంధ్యాల దర్శకత్యం వహించిన  ఈ సినిమా చిరంజీవి  నటించిన సినిమాల లిస్టులో ఇప్పటికీ ప్రముఖ స్థానంలో కొనసాగుతోంది.
NANI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
మెగాస్టార్ చిరు నటించిన ‘చంటబ్బాయ్’ సినిమాని  మళ్ళీ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన తన మైండ్ లో ఉందన్న విషయాన్ని నాని లీకులు ఇస్తున్నాడు. కామెడీ పండించడంలో నానిది  ఒక డిఫెరెంట్ స్టైల్ అయిన నేపధ్యంలో ‘చంటబ్బాయ్’ చిత్రంలో మెగాస్టార్ పోషించిన డిటెక్టివ్ రోల్ తనకు   ఖచ్చితంగా సూటవుతుంది అన్న నమ్మకం నానికి ఉంది. దీనితో రానున్న రోజులలో నానీని ‘చంటబ్బాయ్’ గా చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి.  
NANI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా  ఏ గాడ్ ఫాదర్ లేకుండానే మెల్లగా ఎదిగి ఇప్పుడు ఎనిమిది తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్ స్టేజ్ కు చేరుకున్న నాని ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రూపొందించిన ‘అ’ సినిమాకు మరింత క్రేజ్ ను తీసుకు రావడానికి ఇండస్ట్రీకి చెందిన కొందరిని ప్రత్యేకంగా పిలిచి నిన్నవారందరికీ ప్రత్యేకంగా షో వేసాడు. ఈ షో కి వచ్చన వారు అంతా ‘అ’ మూవీ సూపర్ అంటూ తమ  ట్విట్టర్ లో మోతమోగిస్తున్నారు.  అయితే ఈ స్పెషల్ షో కి నాని చాలమంది ప్రముఖుల్ని పిలవక పోవడంతో  నాని ఫ్లాపుల్లో ఉన్నపుడు తనకు సహకరించిన వ్యక్తులను ఎక్కిన మెట్లను కూడ మరిచిపోయాడా  అంటు కొందరు సెటైర్లు వేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: