పాపులారిటీ విషయంలో రామ్ చరణ్ కన్నా అల్లు అర్జున్ చాల ముందు స్థానంలో ఉన్నాడు అన్న విషయం మెగా అభిమానులు కూడ అంగీకరించే వాస్తవం. నిజానికి రామ్ చరణ్ సినిమాలు ఈమధ్య కాలంలో ఏవీ చెప్పుకోతగ్గ విజయాన్ని సాధించక పోవడంతో బిజినెస్ పరంగా చరణ్ సినిమాలకన్నా అల్లు అర్జున్ సినిమాల బిజినెస్ చాల వేగంగా జరగడమే కాకుండా చరణ్ సినిమాల కన్నా భారీ మొత్తాలకు బన్నీ సినిమాలకు భారీ బిజినెస్ జరుగుతూ ఉంటుంది.

 RAM CHARAN IN RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈ పరిస్థుతులలో రాబోతున్న సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘రంగస్థలం’ మూవీ బిజినెస్ కన్నా ‘నా పేరు సూర్య’ మూవీకి బిజినెస్ బాగా జరిగిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా చరణ్ ‘రంగస్థలం’ బన్నీ ‘నాపేరు సూర్య’ కంటే ఒక విషయంలో చాల ముందడుగులో ఉండటంతో బన్నీ పై చరణ్ ఆదిపత్యంలో ఉన్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ALLUARJUN IN NAAPERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 రెండురోజుల క్రితం జరిగిన వాలెంటైన్స్ డే ని టార్గెట్ చేస్తూ చరణ్ ‘రంగస్థలం’ లోని ‘ఎంత సక్కగున్నావే’ పాట విడుదలైంది. అదేవిధంగా కొన్ని గంటల గ్యాప్ తో అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ లోని ‘లవ్వర్ ఆల్ సో ఫైటర్ ఆల్ సో’ పాట కూడ విడుదలైంది. అయితే ‘రంగస్థలం’ లోని ‘ఎంత సక్కగున్నావే’ పాటకు 4 మిలియన్ల వ్యూస్ ఇప్పటి వరకు వస్తే అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ లోని పాటకు ఇప్పటి వరకు 1.4 మిలియన్లు వ్యూస్ దాటాక పోవడం చరణ్ ఆదిపత్యాన్ని సూచిస్తోంది అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ అల్లు అర్జున్ అభిమానులకు తల నొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.

RAM CHARAN IN RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 దీనికితోడు ‘రంగస్థలం’ మూవీ పై రోజురోజుకు పాజిటివ్ టాక్ పెరుగుతూ ఉంటే వక్కంతం వంశీ కాపీ ప్రయోగాల మధ్య బన్నీ చిక్కుకున్నాడా అంటూ ‘నాపేరు సూర్య’ పై ఇప్పటికీ ప్రతిరోజు సెటైర్లు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సుకుమార్ అద్భుతమైన టేకింగ్ తో రూపొందుతున్న ‘రంగస్థలం’ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్న కామెంట్స్ ఇప్పటికే ఉన్నాయి. ఈ పరిస్థుతులలో మొన్న జరిగిన వాలెంటైన్స్ డే పరీక్షలో అనుకోకుండా చరణ్ బన్నీ పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉండటం ప్రస్తుతానికి టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..      

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: