నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా మారి సంచ‌ల‌నం క్రియేట్ చేశాడు. షూటింగ్ కంప్లీట్ అయ్యేవ‌ర‌కు ఈ సినిమా ఉంద‌ని ఎవ్వ‌రికి తెలియ‌దు. రెజీనా - కాజల్ – నిత్యా మీనన్ – ఈషా రెబ్బా లాంటి వాళ్లు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమా ప్రివ్యూలు చూసిన సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే పాజిటివ్‌గా స్పందించారు. ఇక ఓవ‌ర్సీస్‌లో కూడా ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ అయ్యాయి. ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం అ సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో ?  చూద్దాం.

Image result for awe movie stills

క‌థ ప‌రంగా చూస్తే ఈ కథలో ప్రతి పాత్ర జీవితం కోసం పోరాడుతుంది. వారి వారి సమస్యల నుండి, కోరికల నుండి అధిగమించాలని చూస్తుంది. ముఖ్యంగా లీడ్ క్యారక్టర్స్ అంతా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. వారు ఎదుర్కున్న సమస్యలు ఏంటన్నదే అ! సినిమా కథ. ఫ‌స్టాఫ్‌లో ప్ర‌తి పాత్ర‌ను కొత్త‌గా ఇంట్ర‌డ్యూస్ చేసిన ద‌ర్శ‌కుడు పాత్ర‌ల మ‌ధ్య స‌న్నివేశాలు, ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌తో స‌ర్‌ఫ్రైజ్ చేశాడు.

Image result for awe movie stills

సెకండాఫ్‌లో రెస్టారెంట్ సీన్ల‌ను బాగా తెర‌కెక్కించాడు. క్లైమాక్స్ బాగుంది. మంచి సోషల్ మెస్సేజ్ తో సినిమా ఎండ్ అవుతుంది.  రొటీన్ మాస్ మసాలా, లవ్ స్టోరీలకు భిన్నంగా జీవితం గురించి తెలియచెప్పే ప్ర‌య‌త్నంగా అ సినిమాను అభినందించాలి. సినిమాలో ప్రతి సందర్భంలో దర్శకుడు రివీల్ చేసే పాయింట్స్ ఆడియెన్స్‌కు స‌ర్‌ప్రైజ్ చేశాయి.


సినిమాకు కావాల్సిన మూడ్ అంతటిని ముందే సెట్ చేసి టైటిల్స్ దగ్గర నుండి ఎండ్ కార్డ్ వరకు ఎంగేజ్ అయ్యేలా చేశారు. అయితే రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కావాల్సిన ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. మ‌రి కొత్త త‌ర‌హా సినిమాలు ఇష్ట‌ప‌డే అ సినిమా మిగిలిన ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పిస్తుందో పూర్తి రిజ‌ల్ట్ వ‌చ్చాక కాని తెలియ‌దు. కాని నిజంగా అ సినిమాతో ఆహా అనిపించేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: