రకుల్ ప్రీత్ సింగ్ టాప్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే.! టాలీవుడ్, బాలీవుడ్ లతో సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. ఎలాంటి కేరక్టర్ అయినా ఇట్టే చేయగలగడం రకుల్ నైజం. అయితే.. రకుల్ ను ఓ హీరో తెగ ఇబ్బంది పెట్టేశాడు. అది కూడా పబ్లిక్ లో..!!

Image result for rakul and siddharth

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉంది. ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. కేవలం సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా రకుల్ దూసుకెళ్తోంది. టాలీవుడ్ లో టాప్ లో ఉండగానే బాలీవుడ్ లో కూడా ఆఫర్లను వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ‘అయ్యారీ’ అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఆ సినిమా ఇవాళే రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్లలో రకుల్ ప్రీత్ సింగ్ విస్తృతంగా పాల్గొనింది.

Image result for aiyaary

సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ హీరోయిన్.! అయ్యారీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ జంట విస్తృతంగా తిరుగుతోంది. ఆ క్రమంలో ఢిల్లీలో SRCC కాలేజీకి సినిమా యూనిట్ వెళ్లింది. సిద్ధార్థ్, రకుల్ లను చూడగానే కాలేజీ స్టూడెంట్స్ గోలగోల చేశారు. ఆ జోష్ లోనే వీళ్లిద్దరినీ డ్యాన్స్ చేయాల్సిందిగా స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. వాళ్ల కోరికను కాదనలేని హీరోహీరోయిన్లు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేయడం వాళ్లకు పెద్ద ప్రాబ్లమ్ కాదు. అది వారికి చాలా కామన్.!

Image result for rakul and siddharth

అయితే.. డ్యాన్స్ చేస్తున్న క్రమంలో సిద్ధార్థ్ ఒక్కసారిగా రకుల్ ను ఎత్తుకున్నాడు. అది రకుల్ అస్సలు ఊహించలేదు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. పైగా పొట్టి డ్రస్సులో ఉంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా సిద్ధార్థ్ ఎత్తేసుకోవడంతో రకుల్ చాలా ఇబ్బందిపడింది. అప్పటికి కవర్ చేసినా.. అది రకుల్ ఫేస్ లో చాలా స్పష్టంగా తెలిసిపోయింది. సిద్ధార్థ్ చేసిన ఆ పనికి రకుల్ పైకి ఏమీ అనకపోయినా.. లోపల మాత్రం గిల్టీగా ఫీలైనట్టు అర్థమైంది. అయితే డ్రస్సింగ్ విషయంలో మాత్రం రకుల్ తననుతాను సమర్థించుకుంది. పొట్టి డ్రస్సులైనా, ఇంకేవైనా తనకు కంఫర్ట్ గా ఉంటేనే వేసుకుంటానని తెలిపింది.

Image result for aiyaary

ప్రమోషన్లలో భాగంగా హీరోహీరోయిన్లు ఇలాంటి చిలిపిచేష్టలు చేయడం చాలా కామన్. అయితే అవన్నీ ఒక అండర్ స్టాండింగ్ పైన జరిగిపోతుంటాయి. అయితే అనుకోకుండా జరిగినప్పుడు రకుల్ లాగే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. స్టార్స్ కావడంతో ఏమీ అనలేక సర్దుకుపోతుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: