పద్దెనిమిది సంవత్సరాల పిల్ల ప్రియా ప్రకాష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే .. సోషల్ మీడియా లో విపరీతమైన వైరల్ అయిపోయిన ఆమె ఒకే ఒక్క యూట్యూబ్ వీడియో లో కన్ను గీటి దేశం మొత్తానికీ పెద్ద 'క్రష్' అయ్యి కూర్చుంది.



మలయాళంలో ఓడు అడార్ లవ్ అనే పేరుతో నిర్మించిన చిత్రంలో కేరళ జానపద శైలిలో ప్రియా ప్రకాశ్ కనుసైగ చేస్తూ మాణిక్య మలరయ పూవీ అనే పాటను పాడుతున్న దృశ్యాలు తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కొందరు ముస్లిం సంఘాల వారు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా వారు హైదరాబాద్ లో సినిమా దర్శకుడు ఒమర్ లులూపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు.



ఈ వ్యవహారం మీద స్పందించడానికి ప్రియ సైతం ఇష్టపడలేదు ఒక ఇంటర్వ్యూ లో. అయితే హీరోయిన్ కు కేరళ సీఎం పినరాయి విజయన్ బాసటగా నిలిచారు. అయితే కళలో భావప్రకటన స్వేచ్ఛపై అసహనాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని సీఎం విజయన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.



ఆమె కనుసైగల తో అందరినీ ఆకట్టుకుంటే దానికి ఒక మతం రంగు, దేవుడి రంగూ పులిమే ప్రయత్నం చేస్తారు ఏంటి అంటూ ముఖ్యమంత్రి మండిపడ్డారు. మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బార్ రాసిన గేయాన్ని రఫీఖ్ పాడారని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: