తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున కెరీర్ బిగినింగ్ లో పెద్దగా విజయవంతమైన చిత్రాలు ఏవీ లేవు.  ఇక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన  ‘శివ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించారు. ఈ చిత్రంతో నాగార్జున స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంతగా అంటే..అప్పట్లో నాగార్జున స్టైల్ ని ఎంతో మంది యువకులు ఫాలో అయ్యారు.
Image result for nagarjuna shiva
శివ చిత్రంలో  చైన్ సీన్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో గోవింద గోవింద చిత్రం వచ్చింది.  ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి నటించింది. కానీ ఈ చిత్రం అనుకున్న విజయం సాధించలేక పోయింది. చాలా సంవత్సరాల తర్వాత మరోసారి రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యింది. 
Image result for nagarjuna ram gopal varma
తాజాగా రామ్ గోపాల్ వర్మ తన తొలి సినిమా ‘శివ’ తొలి రోజు షూటింగ్ జరిగింది ఈ రోజేనని చెబుతూ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘శివ’ హీరో నాగార్జున కూడా ఓ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 16 1989..29 సంవత్సరాల క్రితం ఇదే రోజున సినీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన, కొత్త ఆలోచనా దృక్పథానికి నాంది పలికిన ‘శివ’ చిత్రం ప్రారంభించామని, నాగ్-వర్మ కాంబినేషన్ లో వచ్చే మరో చిత్రంతో రాక్ చేసే సమయం ఆసన్నమైందని నాగార్జున పేర్కొన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: