ఈ మద్య సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ల కన్నా బుల్లితెరపై వస్తున్న యాంకర్ల జోరు బాగా పెరిగిపోయింది.  తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో తో వీపరీతమైన  క్రేజ్ తెచ్చుకున్న అనసూయ, రష్మీలతో పాటు ‘పటాస్’ తో శ్రీముఖి కూడా బాగా పాపులర్ అయ్యింది.  దీంతో తెలుగు లో వస్తున్న వివిధ చానల్స్ లో ఈ అమ్మడు యంకరింగ్ చేస్తుంది.  అయితే ఈ మద్య కొన్ని సినిమాల్లో కూడా నటిస్తుంది.  ఒకప్పుడు వెండి తెరపై కనిపించినా..పెద్దగా గుర్తింపు తెచ్చుకోని శ్రీముఖి బుల్లితెరపై వచ్చిన ‘పటాస్ ’ తో మంచి క్రేజ్ సంపాదించింది. 
Image result for srimukhi hot
తాజాగా ఈ అమ్మడు ప్రేమికుల దినోత్సవం రోజు ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ హల్ చల్ చేసింది. గతం లో సినీతార త్రిష తన యద భాగంపై టాటూ వేయించుకొని అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. తాజాగా ఈ జాబితాలోకి బుల్లితెర సెన్సేషన్ శ్రీముఖి కూడా చేరింది.  చేతిపై అరబిక్ భాషలో ఉన్న టాటూతో ఆమె దర్శనం ఇవ్వగానే.. అదేదో తన లవర్ పేరు అయ్యింటుందని అంతా భావించారు. అయితే ఇలాంటి అర్థాలు వస్తాయని ముందే భావించిన శ్రీముఖి.. ఆ టాటూకి అర్ధం కూడా చెప్పేసింది.
Image result for srimukhi hot
నేను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హుబా నాఫసల్ అనే అరబిక్ కొటేషన్ ను ట్యాటూ గా వేయించుకున్న. దాని అర్ధం నిన్ను నువ్వు ప్రేమించుకో. నేను పుట్టినప్పటి నుంచి నేను నాతోనే ప్రేమలో వున్న అంటూ తన టాటూ అసలు రహస్యం తెలిపింది. మొత్తానికి హీరోయిన్లుగా ఫాంలో ఉన్నప్పుడే టాటూ ముద్ర వేయించుకోవడానికి నేటి తరం అమ్మాయిలు ఏమీ జంకడం లేదు. త్రిష.. నయనతార.. సమంత.. తాప్సీ.. అనసూయ… ఇలా ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. వీళ్ల క్లబ్ లోకి లేటెస్ట్ గా శ్రీముఖి ఎంటరైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: