రజనీకాంత్..దేశం గర్వించదగ్గ నటులలో ఒకడు. అతని నటనకు మించి అతని స్టైల్ కు మాత్రమే లెక్కలేని అభిమానులు ఉన్నారంటే అది అతిశయొక్తి కాదు. అందుకే భారతదేశం మాత్రమే కాకుండా విదేశాల్లోనూ ఆయనకు పిచ్చ అభిమానులు ఉన్నారు. ఇక తమిళులు ఆయనను ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. తలైవా అంటే దేవుడని అర్థం. మరి ఇలాంటి స్టార్ ను యువహీరో సందీప్ కిషన్ క్లాసు పీకాడు.


ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సందీప్. కేరీర్ మొదట్లో ప్రస్థానం సినిమాలో హీరో తమ్ముడి పాత్రచేసి మంచి మార్కులే కొట్టాడు. ఆ తరువాత హీరోగా చాలా సినిమాలు చేసినా అవి అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. ఇక 2013 లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా తొలి హిట్ ను సాధించాడు. అప్పటినుండి కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నాడు.


కాగా ప్రస్తుతం సందీప్ నటించిన చిత్రం "మనసుకు నచ్చింది ". నిన్న విడుదలయిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను పొందుతుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్, తనకు  రజనీకాంత్ కు జరిగిన సంఘటనను వివరించాడు.


సందీప్ చిన్నపుడు ఒక ఫంక్షన్ హాల్ కు వెళ్లగా అక్కడ రజని సిగరెట్ తాగుతూ కనపడ్డాడట. వెంటనే సందీప్ ఆయన దగ్గరికి వెళ్లి ఇదెందుకు తాగుతున్నారు? ఇది చాలా డేంజరస్ కదా! ఆరోగ్యం పాడవుతుంది, తాగకండి అని క్లాసు పీకాడట. అందుకు రజనీ నవ్వి ఏం చేస్తాం బాబు ఇది అలవాటు అయిపోయింది అని సమధానం ఇచ్చాడట. ఇది తన జీవితంలో బెస్ట్ ఫ్యాన్ మొమెంట్ అని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: