ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’రియాల్టీ షో భారత దేశంలో బాలీవుడ్ బుల్లితెరపై సల్మాన్ హోస్ట్ గా వ్యవహరించారు.  ఇప్పటికే పది సీజన్లు పూర్తి చేసుకుంది.  ఇక తెలుగు లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరించగా..తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్ లు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు లో పద్నాలు మందితో బిగ్ బాస్ సీజన్ 1 దిగ్విజయంగా పూర్తి అయ్యింది.  అయితే బిగ్ బాస్ సీజన్ 2 త్వరలో మొదలు కాబోతుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. తెలుగు టెలివిజన్ తెర మీద భారీ స్థాయిలో రేటింగ్స్ రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్ చేయడంతో ఈ షో రేటింగ్స్ ఓ రేంజ్‌కు వెళ్లాయి.
Image result for BIG BOSS TELUGU
సమయానుకూలంగా, అందర్నీ నవ్విస్తూ.. తనదైన పంచ్ డైలాగ్స్ తో తారక్ షోను అద్భుతంగా నడిపించాడు. ఇందుకు గానూ ఎన్టీఆర్ భారీగానే రెమ్యూనరేషన్ ముట్టింది. రెండో సీజన్లోనూ అతడే బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తాడని భావించారు..అందుకు యాజమాన్యం కూడా సుముఖంగా ఉందని వార్తలు వచ్చాయి. వాస్తవానికి  బిగ్ బాస్ సీజన్ 2 జూలై నెలలో ప్రారంభం అవుతుందని అందరూ అంచనా వేశారు.  ఈ షో నుంచి తారక్ బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతుండగా.. రాజమౌళి డైరెక్టర్‌గా చెర్రీతో మల్టీస్టారర్ రూపొందనుంది.
Image result for BIG BOSS TELUGU
దీంతో రియాల్టీ షోకు డేట్స్ కేటాయించడం కష్టంగా మారిందట.  తొలి సీజన్లో అతడు ఎపిసోడ్‌కు రూ. 35 లక్షల చొప్పున తీసుకోగా.. దీని కంటే మూడు రెట్లు ఎక్కువగా ఆఫర్ చేయడానికి నిర్వాహకులు సిద్ధపడుతున్నారట. కానీ తారక్ మాత్రం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో  తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: