మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ - రాశీఖ‌న్నా జంట‌గా కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా తొలిప్రేమ‌. శ్రీవెంక‌టేశ్వ‌ర సినీచిత్ర బ్యాన‌ర్‌పై అగ్ర‌నిర్మాత బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను ప్ర‌ముఖ నిర్మాత కండ డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. గ‌త వారంలో శుక్ర‌వారం ఇంటిలిజెంట్‌, గాయ‌త్రి సినిమాలు పోటీగా ఉండ‌డంతో ఒక రోజు ఆల‌స్యంగా శ‌నివారం రిలీజ్ అయిన తొలిప్రేమ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది.
Image result for tholi prema varun tej
నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా రూ.34 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ చిత్రం ఏపి, తెలంగాణల్లో రూ.14.03 కోట్ల షేర్ ను అందుకుంది. వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో రెండో క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచిన తొలిప్రేమ ఫిదా త‌ర్వాత వ‌రుణ్‌కు వ‌రుస‌గా రెండో హిట్ సినిమా అందించిన‌ట్ల‌య్యింది. ఈ సినిమా ఏరియా వైజ్ షేర్ డీటైల్స్ ఇలా ఉన్నాయి.


తొలిప్రేమ ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ షేర్ (రూ.కోట్ల‌లో)
నైజాం - 5.40
సీడెడ్ - 1.70
వైజాగ్ - 2.15
ఈస్ట్ - 1.18
వెస్ట్ - 0.93
కృష్ణా - 1.07
గుంటూరు - 1.14
నెల్లూరు - 0.43
ఓవ‌ర్సీస్ - 2.30
క‌ర్నాట‌క - 1.20
రెస్టాఫ్ ఇండియా - 0.80
----------------------------- 
వ‌ర‌ల్డ్‌వైడ్ = 18.33 కోట్లు
-----------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: