సోషల్ మాద్యమాల పుణ్యమా అని కొంత మంది ఒక్కనైట్ లోనే విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంటున్నారు.  తాజాగా  క్యూట్‌గా కన్ను గీటి.. నెటిజన్ల గుండెలు కొల్లగొట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్క వీడియోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  ఈ అమ్మడి  వీడియో చూసి సామాన్య కుర్రకారే కాదు..సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. స్టైల్ స్టార్  అల్లు అర్జున్ ''ఈ మధ్యకాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోను నేను అస్సలు చూడలేదు.సింప్లిసిటీకి ఉన్న పవరే అది. నాకు చాలా బాగా నచ్చేసింది'' అని ట్వీట్ చేశాడు.  
Image result for allu arjun
రోజు రోజుకీ ప్రియా ప్రకాశ్ పాపులారిటీ పెరిగిపోతూనే ఉంది.  ఆమె ఓ చూపులకు కుర్రకారే కాదు... కొంతమంది స్టార్ హీరోలు కూడా ఫిదా అయ్యారు. ఈ లిస్ట్‌లో క్రికెటర్లు కూడా చేరిపోయారు. మలయాళం చిత్రం ‘ఒరు అదార్ లవ్’ పాటను ఏ ముహూర్తాన రిలీజ్ చేశారో గానీ.. అది ఎల్లలు దాటి వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆ పాటలో ప్రియా చూపులు.. చురకత్తుల్లా కుర్రకారు గుండెల్లోకి దూసుకెళ్లాయి. దీంతో, ఆమె కోసం ఇంటర్నెట్‌లో వెతకడం మొదలుపెట్టారు. ఆ వెతుకులాట (సెర్చింగ్) సన్నిలియోన్ రికార్డులను సైతం బద్దలకొట్టేసింది.
Image result for rishi kapoor priya prakash
ప్రియా పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే..ఏకంగా బాలీవుడ్ సీనియర్ హీరో సైతం ఫిదా అయ్యాడు.   ప్రియ ప్రకాశ్‌  సోషల్ మీడియాలో స్పందించిన రిషి కపూర్.. "ఈ అమ్మాయి భవిష్యత్‌లో మంచి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటుంది. చూడటానికి అమాయకంగా ఉన్నా.. చాలా భావాలు పలికిస్తుంది. మై డియర్ ప్రియ నీ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వారందరు నీ కోసం పరితపిస్తారు. నేను హీరోగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రాలేదు?" అంటూ కామెంట్ పెట్టాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: