మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నేల టికెట్ అన్న టైటిల్ పరిశీలణలో ఉంది. ఎస్.ఆర్.టి మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్రేజీగా జరుగుతుంది.


ఈ సినిమా సన్ టివి శాటిలైట్, డబ్బింగ్ రెండు రైట్స్ కలుపుకుని 25 కోట్ల దాకా కొనేశారట. ఈ రేంజ్ లో రవితేజ సినిమా బిజినెస్ జరగడం సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. లాస్ట్ ఇయర్ రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ అందుకున్న రవితేజ. రీసెంట్ గా వచ్చిన టచ్ చేసి చూడు సినిమా ఫ్లాప్ అందుకున్నాడు.


ఇక సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో హిట్లు కొట్టిన డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ రవితేజతో సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది కాబట్టి సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కేస్తుందని అంటున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, ప్రవీణ్ లు నటిస్తున్నారు.


కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్న రవితేజ కళ్యాణ్ కృష్ణతో పక్కా హిట్ కొడతాడని అంటున్నారు. మాస్ ఆడియెన్స్ కు ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా కథనం ఉండేలా చూస్తున్నారట. తప్పనిసరి హిట్ కొట్టాల్సిన అవసరం ఉన్న రవితేజకు సోగ్గాడు డైరక్టర్ హిట్ అందిస్తాడా లేదా అన్నది చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: