సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను సీసీఎస్ పోలీసులు ప్రశ్నించడం కలకలం రేపుతోంది. కొందరు మహిళాసంఘాల పట్టుదలతో ఈ కేసు చాలా పకడ్బందీగానే తయారవుతున్నట్టు సమాచారం. తాను గొప్ప మేథావినన్న అహంకారంతో వర్మ చట్టంలోని చాలా విషయాలను పట్టించుకోలేదని..ఇప్పుడు అవే ఆయన్ను ఇబ్బందిపెడుతున్నాయని అంటున్నారు. 

varma ccs police కోసం చిత్ర ఫలితం
జీఎస్టీ షూటింగ్ విషయంలో వర్మ మీడియాలో చాలా పబ్లిసిటీ వచ్చేలా చూసుకున్నాడు. మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్ తో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. విదేశాల్లో షూటింగ్ జరిగిందని చెప్పుకొచ్చాడు.. కానీ వాస్తవానికి వర్మ అసలు ఫారిన్ వెళ్లలేదట. అదే నిజమైతే వర్మ ఇండియాలో పోర్న్ సినిమా తీసినందుకు శిక్షార్హుడవుతారు. సీసీఎస్ పోలీసులు కూడా పక్కా ఆధారాలతో వర్మను ప్రశ్నించారట. 

ram gopal varma nagarjuna movie కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం నాగార్జునను ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తోంది. ఆయన వర్మతో తీస్తున్న సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దానిపై చాలా క్రేజ్ ఉంది. కానీ జీఎస్టీ కేసు కారణంగా వర్మ కనుక అరెస్ట్ అయితే.. ఈ సినిమా ఇబ్బందుల్లో పడటం ఖాయం. ఇప్పుడు నాగార్జునను ఇదే టెన్షన్ పెడుతోందట. మరి వర్మ అరెస్ట్ కాకుండా నాగార్జున కూడా తన పలుకుబడి ఉపయోగిస్తారేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: