తను ఏం చేసినా పబ్లిసిటీ కోసమే అన్నట్టు ప్రవర్తించే సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు జిఎస్టి అదేనండి తను తీసిన వెబ్ సీరీస్ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ షాక్ గట్టిగానే తగిలింది. ఆ వెబ్ సీరీస్ విషయమై సామాజిక మహిళా ఉద్యమకారిణి దేవితో వర్మ మాటల యుద్ధం ఆయన్ను సీసీఎస్ కు వచ్చే దాకా తీసుకొచ్చింది.


దాదాపు 3 నుండి 4 గంటల దాకా జరిగిన విచారణలో చాలా ప్రశ్నలను వర్మ ముందు ఉంచారట పోలీసులు. కొన్ని ప్రశ్నలకు వెంటనే.. మరికొన్ని ప్రశ్నలకు కాస్త సమయం తీసుకుని సమాధానం ఇచ్చారట వర్మ. అయితే మొత్తం విచారణ ముగించుకుని వచ్చాక వర్మ బయటకు వచ్చి తాను ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాలని ఉందని ట్వీట్ చేశాడు.


అలా వర్మ అడిగాడో లేదో స్క్రిప్ట్ రెడీ సార్ అంటూ రిప్లై ఇచ్చాడు వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్. థ్యాంక్యూ సార్ అని వర్మ కూడా పూరికి రిప్లై ఇచ్చాడు. మరి సడెన్ గా వర్మకు ఎందుకు పోలీస్ గా నటించాలని అనిపించింది అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్. పోలీసులు తనకి నిజంగానే చుక్కలు చూపించి ఉంటారని.. అందుకే అది నచ్చి తాను పోలీస్ గా చేయాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు.


ఇక విచారణలో తన లాప్ టాప్ కూడా తీసుకున్నారని తెలుస్తుంది. విచారణ పూర్తి చేసుకుని వచ్చి రాగానే పోలీస్ పాత్ర చేస్తాను అన్నాడంటే వర్మ దీన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంటున్నాడని తెలుస్తుంది. ఇక శిష్యుడు పూరి స్క్రిప్ట్ కూడా రెడీ అంటున్నాడు. మరి ఇద్దరు కలిసి ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి. 
అ!న్ని సా


మరింత సమాచారం తెలుసుకోండి: