వి వి వినాయక్ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్. ఎంతలా అంటే రాజమౌళి తరువాత తనే పేరే వినిపించేదే. అయితే ఇప్పుడు సీన్ మారింది... తను రీమెక్ లు తీస్తేనే హిట్ అవుతున్నాయి. లేకపోతే ఘోరమైన డిజాస్టర్ గా మారిపోతున్నాయి. సినిమా ఇండస్ట్రీ విచిత్రమైనది. ఒక హిట్ సినిమా పడగానే కొండంత ఎత్తుకి తీసుకెళ్లి పెడుతుంది. అదే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఇంటికి వచ్చే వారు కూడా ఉండరు. 

Image result for vv vinayak

జీవితం కూడా ఎక్కడో కిందకి పడిపోతుంది. ఇదే ఎప్పుడూ ఇండస్ట్రీ లో జరగుతుంది అఖిల్ సినిమాతో కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా అట్టర్ ఫ్లాప్ సినిమా అనే పేరు ని మూటగట్టుకున్నాడు వివి వినాయక్. అప్పుడు కూడా సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ మధ్యనే విడుదల అయిన ఇంటెలిజెంట్ సినిమా కూడా డల్ కలెక్షన్స్ తో మొదటి షో నుండి దారుణమైన రెస్పాన్స్ ని మూటగట్టుకుంది.
Image result for vv vinayak
దాదాపు 27 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా. విడుదల అయ్యాక బిజినెస్ క్లోజ్ అయ్యే సమయానికి 7 కోట్లు వసూలు చేసింది. ఇంత మొత్తం లో భారీ నష్టాన్ని వివి వినాయక్ తీసిన ఏ సినిమా పొందలేదు. అందుకే ఈ సినిమా కి కూడా అయన తీసుకున్న మొత్తం డబ్బుని వెనక్కి ఇచ్చేసారు. దాదాపు 5 కోట్ల డబ్బులు దాకా వెనక్కి ఇచ్చారు అని టాక్. వ్యక్తిగతంగా అందరూ ఇష్టపడే వ్యక్తి అయిన వినాయక్, ఇలా చెయ్యడం పట్ల సినిమా నిర్మాతలు , డిస్ట్రిబ్యటర్లు సంతోషం వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: