టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్. ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి  దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 తో హీరోగా మారాడు. తర్వాత వచ్చిన సినిమాల్లో ఎన్టీఆర్ కాస్త లావెక్కడంతో చాన్సులు తగ్గుముఖం పట్టాయి.  మరోసారి ఎన్టీఆర్ పై జక్కన్న చేసిన ప్రయోగంతో మనోడి దశ ఒక్కసారే తిరిగిపోయింది.  రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’సినిమా మరో ఘన విజయం సాధించింది.   
Related image
నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ తో వరుస విజయాలు అందుకుంటున్నాడు ఎన్టీఆర్.  ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు..ఈ సినిమా పూర్తయిన తర్వాత మరోసారి రాజమౌళి దర్శకత్వంలో కనిపించబోతున్నాడు.  ఎన్టీఆర్ అభిమానులకు ఇప్పుడు మరో శుభవార్త చెప్పబోతున్నాడు,ఎన్టీఆర్ మరో సారి తండ్రి కాబోకున్నాడు అని తెలుస్తుంది. క ప్రణతి మరో బిడ్డకు తల్లి కానుందన్న విషయమై అతి త్వరలోనే ఎన్టీఆర్ స్వయంగా అధికారిక ప్రకటన చేయనున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Related image
రాజమౌళి మూవీ మల్టి స్టారర్ దీని లో ఎన్టీఆర్ కు జోడి గా మరో హీరో గా మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నాడు.ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్నాడన్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: