మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బోయపాటి మార్క్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందట. ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా క్రేజీ అటెంప్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.


ఈ సినిమాకు గాను అతనికి 3 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు కోలీవుడ్ నుండి జీన్స్ ప్రశాంత్ కూడా ఈ సినిమాలో నటిస్తాడట. భారీ స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా టైటిల్ జిల్ జిల్ జిగేల్ అంటూ పెట్టబోతున్నారు. చరణ్, బోయపాటి శ్రీను ఈ కాంబినేషనే అంచనాలు పెంచేస్తుంటే ఈ టైటిల్ కూడా జిగేల్ మనిపించేలా ఉంది.


జయ జానకి నాయకా సినిమాతో సత్తా చాటిన బోయపాటి ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా సరే మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. అందుకే చరణ్, బోయపాటి సినిమా అనగానే హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్. ప్రస్తుతం రంగస్థలం సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమా చేస్తూనే బోయపాటి మూవీ చేస్తున్నాడు.


మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న బోయపాటి మూవీ అక్టోబర్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రంగస్థలం మాత్రం మార్చి 30న వచ్చేస్తుంది. ఇక ఈ ఇయర్ అక్టోబర్ నుండి రాజమౌళితో చేసే మల్టీస్టారర్ కు డేట్స్ ఇచ్చేశాడు చరణ్. మొత్తానికి వరుస వెంట క్రేజీ సినిమాతో చెర్రి అదరగొట్టబోతున్నాడని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: