అప్పుడెప్పుడో వచ్చిన నీకోసం, చిత్రం, ఇట్లుశ్రావని సుబ్రమణ్యం నుండి మొన్నీమధ్య వచ్చిన డిక్టేటర్, సోగ్గాడేచిన్నినాయన వరకు ఉన్న సినిమాలలోని పాటలకు తన స్వరాన్ని సమకూర్చి ఆ పాటలకు అందాన్ని తెచ్చింది ప్లేబాక్ సింగర్ కౌసల్య. సినిమాలలో పాడటం మాత్రమే కాకుండా టీవీ షో లకు వాఖ్యాతగా మరియు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ కెరీర్ ను జాగ్రత్తగా నడుపుతుంది. ఎంత సెలెబ్రెటీ హోదాలో ఉన్నా ఆమెకూ భర్త నుండి వేధింపులు తప్పలేదు.


తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తాను ఎదుర్కొన్న గృహహింసను వివరించింది. పెళ్లిలో మర్యాదలు సక్రమంగా చేయలేదని ఆమె భర్త తన తల్లిని తిడుతుంటే  మధ్యలో తాను కల్పించుకుని తన తల్లిని ఏమీ అనవద్దని అని ఒక్కమాట అనడంతోనే  అతను శోభనం జరిగిన మరుసటి రోజే తనపై చేయి చేసుకున్నాడని ఆ సంఘటన తలచుకుంటే ఇప్పటికీ భాదగా ఉంటుందని ఆమె తెలిపింది.


తన కొడుకు పుట్టిన ఆరేళ్ల తరువాత కూడా ఇలానే ప్రవర్తించేవాడని చెప్పింది. అంతేగాక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే సూపర్ సింగర్ కార్యక్రమ ఏడవ సీజన్ షూటింగ్ జరుగుతుండగా వారిద్దరి మధ్య ఉన్న గొడవలను తగ్గించ ప్రయత్నం చేయడానికి తన బావ వస్తే, ఆయన ముందే తనను రక్తం వచ్చేలా చితకబాదాడని ఆమె తెలిపింది. తండ్రి తర్వాత భర్తనే సర్వస్వం అని వస్తే మృగంలా ప్రవర్తించాడు, ప్రస్తుతం భర్త నుండి విడాకులు తీసుకుని కొడుకుతో ప్రశాంతమయిన జీవితం గడుపుతున్నానని ఆమె తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: