టాలీవుడ్ బ్రాండ్ అంబారిడ‌ర్‌గా ఎదుగుతున్నది ఒక్క ప్రిన్స్ మాత్రమే కాదు. అల్లు వారి హీరో అల్లుఅర్జున్ కూడ పోటీ ప‌డుతున్నాడు. ప్రిన్స్ త‌రువాత ఎక్కువ యాడ్స్‌లో న‌టించేది మెగా హీరో అల్లుఅర్జునే. అల్లుఅర్జునే ఇప్పటికే మూడు యాడ్స్‌కు అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. రీసెంట్‌గా ఓ మొబైల్ కంపెనీతో అగ్రిమెంట్ చేసి ఇలా ద‌ర్శన‌మిచ్చాడు. బ్రాండ్ ఎంబాసిడ‌ర్‌గా సంవ‌త్సరానికి ప్రిన్స్ ఆదాయం 80 కోట్ల మార్కును చేరుకోగ‌లిగితే, అల్లు అర్జున్ ఆదాయం 30 నుండి 40 కోట్లకు చేరుకుంది.

ఇప్పటికే సంతూర్ ప్రొడ‌క్ట్ కోసం మ‌హేష్‌తో డీల్ కుదుర్చుకున్న సంస్థ, మ‌హేష్ త‌రువాత ఎవ‌రు అనే స‌ర్వేలో అల్లుఅర్జున్‌కే ఎక్కువ మంది ఓటు వేశార‌ట‌. ఈ విధంగా అల్లుఅర్జున్ క్రేజ్ ఎడ్వర్‌టైజ్‌మెంట్స్‌లోనూ కొన‌సాగుతుంది. లోట్ మైబైల్స్ షాపికు ఒక సంవ‌త్సరం పాటు అంబాసిడ‌ర్‌గా అగ్రిమెంట్స్ కుదిరిన‌ట్టు స‌మాచారం. ప్రిన్స్ త‌న ప్రతి మూవీలో త‌న యాడ్స్ ప్రమోష‌న్‌ కోసం కొంత అవ‌కాశాన్ని క‌ల్పిస్తాడు. అలాగే అల్లు అర్జున్ అప్ క‌మింగ్ మూవీల‌లో కూడ త‌న అంబాసిడ‌ర్‌గా ఉన్న బ్రాండ్లకు ఆ చోటు క‌ల్పిస్తున్నట్టు అన‌ధికార స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: