టాలీవుడ్ లో తన అందచందాలతో కెరీర్ తొలినాళ్లలో కుర్రకారుని మంత్రముగ్ధులను చేసిన అనుష్క..తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వస్తుంది.  ఇక అనుష్క లేడీ ఓరియెంటెడ్ పాత్రలు . అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి లాంటి సినిమాలు వివమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  కొన్ని సార్లు  అనుష్క టాలీవుడ్ సినిమాల్లో చేసిన కొన్ని పాత్రలు చూస్తుంటే.. అవి ఆమె కోసమే పుట్టాయా? అని అనిపిస్తుంటుంది. పాత తరం టాప్ హీరోయిన్లు తమ  అభినయం తో ఎంతగొప్పగా రాణించే వారో..ఇప్పుడు అనుష్క కూడా అదే కోవలోకి వస్తుంది. 
Image result for mahanati
ఇప్పటి వరకు ఆమె నటించిన పాత్రలకు జీవం పోసిందని చెప్పాలి. ఆమె తప్ప మరెవ్వరూ ఆ రోల్స్‌కు సూట్ కారని ప్రేక్షకులు, అభిమానులు కూడా గట్టిగా చెబుతుంటారు.  తాజాగా మరో క్రేజీ పాత్ర ఆమె తలుపు తట్టినట్లు సమాచారమ్. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'మహానటి' సినిమాలో అలనాటి నటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి పాత్రను ఈ సినిమాలో అనుష్క పోషించనుందనే వార్త టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందుకు ఆమె  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Image result for mahanati
ఒకప్పుడు ఎన్టీఆర్, ఎఎన్ ఆర్ లు కూడా భానుమతితో నటించాల్సి వస్తే కాస్త ఆలోచించే పరిస్థితి ఉండేదట.  ఆమె హూంధాతనం, నటన, గాంభీర్యం మాత్రమే కాదు అప్పట్లో సినిమాలకు సంగీతం, రచన, దర్శకత్వం లో కూడా మంచి ప్రావీణ్యం భానుమతి సొంతం. సావిత్ర, భానుమతి సమకాలీన నటీమణులు. ఇద్దరూ ఆ సమయంలో పోటాపోటీగా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నవారే.
Image result for bhanumathi
మహానటి సినిమా ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ తన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ బాణీలు అందించారు. వచ్చే నెల 20న దీనిని రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: