గత వారం రోజులుగా సోషల్ మీడియాను స్థంభింపచేస్తున్న ప్రియా వరియర్ ఒరు అదార్ లవ్ సినిమా ప్రమోషన్స్ లో కూడా బీభత్సమైన క్రేజ్ తెచ్చింది. ఇక ఈమధ్యనే ఈ సినిమాకు సంబందించిన ఓ ఫంక్షన్ లో లైవ్ లో తుపాకి గురు పెట్టిన ప్రియా కోట్ల హృదయాలను కొల్లగొట్టింది. టీజర్ తో లెక్కలేనంత మంది ఫాలోవర్స్ ను ఏర్పరచుకున్న ఈ అమ్మడు కనుసైగలతో అల్ల కల్లోలం సృష్టించింది. 


దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న ప్రముఖ వ్యక్తుల్లో ఇప్పుడు మలయాళ భామ ప్రియ వరియర్ ఒకరు. కంటిచూపుతో అమ్మడు చేసిన ఆ సైగలకు కుర్ర హృదయాలన్ని రాసి ఆమెకు ఇచ్చేశారు. ప్రియా గురించి ఎలా న్యూస్ వచ్చినా సరే నోరెళ్ల బట్టి మరి చూసేస్తున్నారు. ఇక ఈమధ్యనే ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రియ ఏదైతే సినిమాలో చేసిన తుపాకి పర్ఫార్మెన్స్ లైవ్ లో చేసింది.


సినిమాలో ఆమె తుపాకి గురికి పడిపోయింది అతను మాత్రమే కాని ఈ లైవ్ పర్ఫార్మెన్స్ లో అమ్మడు గురి పెట్టిన తుపాకి మాత్రం కోట్లమంది హృదయాలను కొల్లగొట్టింది. అమ్మడు క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియా అంతా సందడి సందడిగా మారింది. ఇక ఈ క్రేజ్ తోనే తెలుగు, తమిళ పరిశ్రమల నుండి ఛాన్సులు కూడా పట్టేస్తుంది ప్రియా.


టాలీవుడ్ లో ఇప్పటికే నిఖిల్ సరసన అవకాశం అందుకుందట. అల్లు అర్జున్ కూడా ప్రియని చూసి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రిషి కపూర్ కూడా ప్రియా నువ్వు ఇంతకుముందే రావాల్సిందని అన్నారు. మొత్తానికి తనకు వచ్చిన క్రేజ్ ను ఆ చిత్రయూనిట్ బాగా వాడేస్తుంది. ప్రియ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: