ఆ మద్య సినిమా ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేసింది మళియాళ నటి భావనపై అత్యాచార ఉదంతం. ఆమె సొంత డ్రైవర్ మరో  డ్రైవర్ తో కలిసి కిడ్నాప్ చేసి రెండు గంటల పాటు లైంగిక దాడి చేసి అశ్లీల ఫోటోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు భావన నేరస్థులకు శిక్ష పడే వారకు పోరాడింది..ఎట్టకేలకు నింధితులను పోలీసులు అరెస్టు చేశారు.  నటి భావన చేసిన ధైర్యం పలువురు ఇండస్ట్రీలో హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది. కొంత మంది హీరోయిన్లు గతంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి సోషల్ మాద్యమాల ద్వారా వెల్లడించారు. 
Image result for భావన లైంగిక దాడి apherald
సినిమా చాన్స్ రావాలంటే..కొంత మందికి పడక సుఖం అందించాల్సిందే..లేదంలే వారికి కెరీర్ లేకుండా చేస్తామని బెదిరిస్తారని పలువురు హీరోయిన్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటి వరకూ సినీ పరిశ్రమలో నిర్మాతల నుంచి హీరోల నుంచి వేధింపులను ఎదుర్కొన్నాం అని ప్రకటించిన హీరోయిన్లను చాలా మంది చూశాం. దశాబ్దాల కిందట తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను కూడా ఇటీవల పలువురు నటీమణులు బయటపెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమపై కూడా కొందరు సంచలన ఆరోపణలు చేశారు.
Image result for భావన లైంగిక దాడి apherald
తమను ఒక హీరో బెడ్రూమ్ కు రమ్మన్నాడని, తాము నిర్మాతల నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నామని వివరించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. తాజాగా వీటన్నింటికి రివర్స్ గా మాట్లాడుతూ..బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకురాలు  ఏక్తా కపూర్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యానాలు సంచలనంగా మారాయిప్పుడు. ‘మీ సినిమాలో అవకాశం ఇస్తే.. నేను బెడ్రూమ్ కు రావడానికి సిద్ధం..’ అని కొంతమంది నటీమణులే ప్రతిపాదిస్తారని ఏక్తా చెబుతోంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు.. ఇలా చాలా మందికి ఇలాంటి ఆఫర్లు వస్తాయని ఏక్తా కపూర్ చెప్పింది. 
Image result for భావన లైంగిక దాడి apherald
కొంతమంది హీరోయిన్లే సెక్సువల్ ఫేవర్ చేయడానికి రెడీగా ఉంటారు అని! ఆ హీరోయిన్లే ఈ ప్రతిపాదన తెస్తారు అని ఏక్తా చెబుతోంది. ఇలాంటి విషయాల్లో ప్రతిసారీ ఆడవాళ్లనే అనగా హీరోయిన్లనే బాధితులుగా చూడనవసరం లేదని కూడా ఏక్తా స్పష్టం చేశారు. బాలీవుడ్ లో ఇప్పుడు ఏక్తా కపూర్ కి.. క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేసే హీరోయిన్ల కు మద్య పెద్ద యుద్దమే జరుగుతుంది. 

Image result for actress cast couching


మరింత సమాచారం తెలుసుకోండి: