టీవి 9 తెలుగు రాష్ట్రాల్లో దమ్మున్న ఛానల్ గా పేరుంది. అయితే ఈ మద్య ఆ ఛానల్ చేస్తున్న ప్రోగ్రామ్స్ వల్ల ఉన్న ఇమేజ్ కూడా పోగుట్టుకుంటుందని అందరు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పుడు వర్మ కూడా టీవి 9 మీద మండిపడుతున్నాడు. ఆయన తెరకెక్కించిన ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ (జీఎస్టీ) ఎన్నో వివాదాలు మూటగట్టుకుంది. ఆ మద్య సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటంతో సామాజిక కార్యకర్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Image result for ram gopala varma
దాంతో శనివారం నాడు సీసీఎస్ పోలీసుల విచారణకు వర్మ హాజరైన విషయం తెలిసిందే. కాగా, మహిళా సంఘం నేతలపై చేసిన అసభ్యకర కామెంట్స్ పై నిన్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, రాంగోపాల్ వర్మ ఉక్కిరిబిక్కిరయ్యారట. మొత్తానికి దేవికి క్షమాపణ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే..హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణ తరువాత, మీడియాలో వస్తున్న వార్తలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
Image result for ram gopala varma
జీఎస్టీ చిత్రాన్ని తాను తీయలేదని, స్క్రిప్టును మాత్రమే ఇచ్చానని పోలీసులకు చెప్పానని పలు వార్తా చానళ్లు, పత్రికల్లో వార్తలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాన్ని ఖండిస్తున్నట్టు చెప్పాడు. తాను సినిమా నిర్మాణంలోనూ భాగస్వామినేనని చెప్పాడు. సినిమాకు తాను సాంకేతిక సహకారాన్ని మాత్రమే ఇచ్చానని ఎలా రాస్తారని ప్రశ్నించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనాన్ని పోస్టు చేశాడు వర్మ. అలాగే టీవీ 9 పై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించాడు. టీవీ 9 ఒక సర్కస్ జోకర్ చానెల్ అని తన అకౌంట్ లో పోస్ట్ చేసాడు వర్మ. 


మరింత సమాచారం తెలుసుకోండి: